రాచూరు (భట్టిప్రోలు)

రాచూరు బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రం భట్టిప్రోలు నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

రాచూరు
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాచూరు is located in తెలంగాణ
రాచూరు
రాచూరు
అక్షాంశరేఖాంశాలు: 16°06′09″N 80°46′51″E / 16.1026°N 80.7807°E / 16.1026; 80.7807
రాష్ట్రం తెలంగాణ
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

పంచాయతీ చెరువు.

గ్రామ పంచాయతీ

మార్చు
  1. 2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాచూరు సిద్ధార్ధబాబు, సర్పంచిగా ఎన్నికైనారు.
  2. ఈ గ్రామాన్ని కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి, కార్యదర్శి, 2015,ఆగస్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు.

గ్రామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మార్చి-9న, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా జరిగింది. 7,8 తేదీలలో విగ్రహాల ఊరేగింపు, అభిషేకాలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, రు. 25 లక్షల ఆర్థిక సాయంతో పునర్నిర్మించిన దేవస్థానం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజున ఉదయం, యగ్నహోమాలు, పూజా కార్యక్రామాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటుచేశారు. గ్రామంలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో, శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

గ్రామ విశేషాలు

మార్చు

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో భక్తి టీ.వీ. ఆధ్వర్యంలో నిర్వహించిన కోటిదీపోత్సవాల సందర్భంగా, రాచూరు గ్రూపు దేవాలయాలలో పనిచేయుచున్న దివి వెంకట అప్పలాచార్యులను, రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి శ్రీ రామచంద్రయ్య, పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు.[1]

మూలాలు

మార్చు
  1. గుంటూరు రూరల్/వేమూరు, 13 నవంబరు 2013. 2వ పేజీ.