రాజకీయ చదరంగం 1989 లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ సమర్పణలో జి. హనుమంత రావు, జి. ఆదిశేషగిరి రావు నిర్మించారు,[1] పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత ప్రధాన పాత్రలలో నటించారు.[3] రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[4] ఈ చిత్రం ఆగస్టు 1 (1988) అనే మలయాళ చిత్రానికి రీమేక్.

రాజకీయ చదరంగం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాణం జి.ఆదిశేషగిరిరావు
జి.హనుమంతరావు
కృష్ణ (సమర్పకుడు)
చిత్రానువాదం పి.చంద్రశేఖర రెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు త్రిపురనేని మహారథి
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
కూర్పు నాగేశ్వరరావు
సత్యనారాయణ
నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్
భాష తెలుగు

నిజాయితీ పరుడైన సత్యమూర్తి (అక్కినేని నాగేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో కథ మొదలవుతుంది. ఆ తరువాత, అతను తన మంత్రివర్గంలో స్వచ్ఛమైన ఇమేజ్ ఉన్న వ్యక్తులను ఎంచుకుని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులను తెస్తాడు. ఇది ముఖ్యమంత్రి కుర్చీని ఆశించే మరొక బలమైన నాయకుడు జోగినాథం (కోట శ్రీనివాసరావు) కు, అతడి అనుచరులకూ ఇది కంటగింపుగా మారుతుంది. వీరంతా రాజకీయ లాబీయిస్ట్ కాంట్రాక్టరైన పాపారావు (ప్రభాకర్ రెడ్డి) తో కలిసి రహస్య సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి సత్యమూర్తిని హత్య చేయాలని నిర్ణయించుకుంటారు. దీనికోసం పాపారావు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ నారంగ్ (చరణ్ రాజ్) ను సంప్రదిస్తాడు. అతను నవంబరు 1 వరకు గడువు ఇస్తాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా పోలీసు శాఖకు ఈ కుట్ర సమాచారం లభిస్తుంది. వారు సిఎం రక్షణ కోసం ఎస్పీ ప్రతాప్ (కృష్ణ) అనే శక్తివంతమైన పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమిస్తారు. ఎస్పీ ప్రతాప్ సిఎంను రహస్య కిల్లర్ నుండి ఎలా రక్షిస్తాడనేది మిగతా కథ,

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rajakeeya Chadarangam (Banner)".
  2. "Rajakeeya Chadarangam (Direction)".
  3. "Rajakeeya Chadarangam (Cast & Crew)". Archived from the original on 2018-10-16. Retrieved 2020-08-08.
  4. "Rajakeeya Chadarangam (Review)". Archived from the original on 2018-10-17. Retrieved 2020-08-08.