మన్నవ బాలయ్య

సినీ నటుడు
(ఎం.బాలయ్య నుండి దారిమార్పు చెందింది)

మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 - 2022 ఏప్రిల్ 9) తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.

మన్నవ బాలయ్య
జననం (1930-04-09) 1930 ఏప్రిల్ 9 (వయసు 93)
చావపాడు గ్రామం, గుంటూరు జిల్లా
మరణం2022 ఏప్రిల్ 9 (92 years)
హైదరాబాదు
విద్యబి. ఇ, మెకానికల్ ఇంజనీరింగ్ (1952)
వృత్తిఅధ్యాపకుడు, నటుడు, నిర్మాత, రచయిత
తల్లిదండ్రులు
  • గురవయ్య (తండ్రి)
  • అన్నపూర్ణమ్మ (తల్లి)

జీవిత విషయాలు సవరించు

గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశాడు.

చిత్రరంగం సవరించు

మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన "పల్లెవాసం-పట్నవాసం"కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, చిత్రానువాదం, పాటలు అందించాడు.[3]

నటించిన చిత్రాలు సవరించు

ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా

1950లు సవరించు

1960లు సవరించు

1970లు సవరించు

1980లు సవరించు

1990లు సవరించు

2000లు సవరించు

2010లు సవరించు

నిర్మించిన చిత్రాలు సవరించు

మరణం సవరించు

92 ఏళ్ల బాలయ్య అనారోగ్యంతో 2022 ఏప్రిల్ 9న హైద‌రాబాదులో క‌న్నుమూశారు. ఇదే రోజు ఆయ‌న పుట్టిన‌రోజు కూడా.[6][7][8]

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 50
  2. "హ్యాపీ బర్త్ డేస్ - ఆల్‌ రౌండర్‌ బాలయ్య ఆంధ్రప్రభ 2011 ఏప్రిల్ 8". Archived from the original on 2011-09-23. Retrieved 2011-07-16.
  3. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.
  4. Andhra Jyothy (9 April 2022). "బాలయ్యకు ఆ వేషం ఎలా దక్కిందంటే..." Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  5. Andhra Jyothy (9 April 2022). "శివుడంటే బాలయ్యే!". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  6. "సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూత". Samayam Telugu. Retrieved 2022-04-09.
  7. 10TV (9 April 2022). "సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత" (in telugu). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. V6 Velugu (9 April 2022). "సీనియర్ నటుడు ఎం. బాలయ్య కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.