రాజయోగం (2022 సినిమా)

రాజయోగం 2022లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మణి లక్ష్మణ్ రావు నిర్మించిన ఈ సినిమాకు రామ్ గణపతి దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను 2022 డిసెంబర్ 21న విడుదల చేయగా,[2] సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.[3]

రాజయోగం
Rajayogam.jpg
దర్శకత్వంరామ్ గణపతి
నిర్మాతమణి లక్ష్మణ్ రావు
తారాగణంసాయి రోనక్
అంకిత సాహా
అజయ్ ఘోష్
బిస్మి నాస్
ఛాయాగ్రహణంవిజయ్.సి. కుమార్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంఅరుణ్ మురళీధరన్
నిర్మాణ
సంస్థలు
శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2022 డిసెంబరు 3 (2022-12-03)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

మధ్యతరగతి కుటుంబానికి చెందిన రిషి (సాయిరోనక్) మెకానిక్ గా పని చేస్తూ ఎలాగైనా డబ్బున్న అమ్మాయిని ప్రేమించేసి… జీవితంలో సెటిల్ అయిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలో శ్రీ (అంకిత సాహా)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆమె విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే కోరికతో బిజినెస్ మ్యాగ్నెట్ (జీవా)తో రిలేషన్‌పిప్ లో ఉంటుంది. ఆ తర్వాత రిషి పరిస్థితి ఏమిటి? చివరికి ఐశ్వర్య, శ్రీలో ఎవరిని రిషి పెళ్లి చేసుకొన్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: మణి లక్ష్మణ్ రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గణపతి[6]
  • సహ నిర్మాతలు: డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్
  • సంగీతం: అరుణ్ మురళీధరన్
  • సినిమాటోగ్రఫీ: విజయ్.సి. కుమార్
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • మాటలు: చింతపల్లి రమణ

మూలాలుసవరించు

  1. Andhra Jyothy (5 February 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
  2. Prajasakti (21 December 2022). ""రాజయోగం" ట్రైలర్ ఆకట్టుకుంది : దర్శకుడు మారుతి" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  3. V6 Velugu (29 December 2022). "ఈ నెల 30న 'రాజయోగం'". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  4. Sakshi (29 December 2022). "'రాజయోగం' మూవీ రివ్యూ". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  5. TV5 News (30 December 2022). "ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులయోగం : రాజయోగం రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  6. Sakshi (26 December 2022). "ఆ సినిమాతో సంపాదించిందంతా పోగొట్టుకున్నాను: డైరెక్టర్‌". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.