సాయి రోన‌క్ (జననం 1991 అక్టోబరు 9) భారతీయ నటుడు, డ్యాన్సర్. అతను ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తున్నాడు. ప్రెజర్ కుక్కర్ (2020) చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సాయి రోనక్
జననం
సాయి కిరణ్

(1991-10-09) 1991 అక్టోబరు 9 (వయసు 31)
వృత్తినటుడు, డ్యాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

బాల్యం, విద్యసవరించు

సాయికిరణ్ గా ఆయన 1991 అక్టోబరు 9న జన్మించాడు. ఇంజనీరింగ్ చదువుతూనే పలుచిత్రాలలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ సమయంలో పాఠశాల (2014), గుప్పెడంత ప్రేమ (2016), కాదలి (2017) వంటి అనేక చిత్రాలలో నటించాడు.

కెరీర్సవరించు

కాదలి చిత్రంతో తన నటనకు విమర్శకుల నుండి ప్రసంశలు అందుకున్న సాయి రోనక్ తర్వాత హై డ్యాన్స్ స్టూడియో పేరుతో హైదరాబాద్‌లో తన సొంత డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు. 2020లో ప్రెజర్ కుక్కర్‌లో నటించాడు.

ఫిల్మోగ్రఫీసవరించు

Year Film Role Notes
2014 పాఠశాల ఆది
2016 గుప్పెడంత ప్రేమ యువ
2017 లంక దర్శకుడు సాయి
కాదలి క్రాంతి
2018 మసకలి సూర్య [1]
2020 ప్రెజర్ కుక్కర్ కిషోర్
2021 ఛలో ప్రేమిద్దం ఆత్మారావు
సవ్యసాచి SonyLIVలో విడుదలైంది[2]
2022 అంటే సుందరానికి వంశీ అతిధి పాత్ర
ఓదెల రైల్వే స్టేషన్ అనుదీప్
రాజాయోగం
2023 పాప్‌కార్న్‌ [3]

మూలాలుసవరించు

  1. "Masakkali joins the Vinayaka Chaviti-release race - Times of India". The Times of India.
  2. "BRO Review: A poignant tale of a grieving brother". The Times of India.
  3. "Popcorn Trailer: యూత్‌ని ఆకట్టుకునేలా 'పాప్‌కార్న్‌' ట్రైలర్‌". web.archive.org. 2023-02-10. Archived from the original on 2023-02-10. Retrieved 2023-02-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)