రాజయ్యగారి ముత్యంరెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
రాజయ్యగారి ముత్యంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో రామాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
రాజయ్యగారి ముత్యంరెడ్డి | |||
| |||
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1978 - 80 | |||
నియోజకవర్గం | రామాయంపేట శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1923 కామారం గ్రామం, శంకరంపేట (ఆర్) మండలం, మెదక్ జిల్లా | ||
మరణం | 3 మే, 2021 | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్[1] | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ | ||
మతం | హిందూ |
జననం
మార్చురాజయ్యగారి ముత్యంరెడ్డి మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) మండలం, కామారం గ్రామంలో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చురాజయ్యగారి ముత్యంరెడ్డి 1978లో రామాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2] 1980లో కాంగ్రెస్ టీ.అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించడంతో ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు. రామాయంపేట ఎమ్మెల్యేగా పదవీ త్యాగం చేసిన తర్వాతి కాలంలో ముత్యం రెడ్డి ఎమ్మెల్సీగా, మెదక్ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశాడు.
మరణం
మార్చుఆయన అనారోగ్యంతో బాధపడుతూ 2021, మే 3న మరణించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (3 May 2021). "మాజీ ఎంఎల్ఎ ముత్యంరెడ్డి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ Namasthe Telangana (3 May 2021). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ Disha daily (దిశ) (3 May 2021). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మృతి". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.