రాజావారు రాణిగారు
రాజావారు రాణిగారు 2019లో విడుదలైన చిత్రం. ఎస్.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ & మీడియా9 బ్యానర్ పై మనోవికాస్.డి, మనోజ్ నిర్మించిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజావారు రాణిగారు టీజర్‌ను 2019, నవంబర్ 18న విడుదల చేసి, సినిమాను నవంబర్ 29న విడుదల చేశారు.
రాజావారు రాణిగారు (2019 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోలా రవికిరణ్ |
---|---|
నిర్మాణం | మనోవికాస్.డి |
తారాగణం | కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ |
సంగీతం | జై క్రిష్ |
ఛాయాగ్రహణం | విద్యాసాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల |
కూర్పు | విప్లవ్ నైషధం |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ & మీడియా9 బ్యానర్ |
విడుదల తేదీ | 29 నవంబర్ 2019 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుశ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్ అబ్బవరం) అదే గ్రామానికి చెందిన రాణి (రహస్య గోరక్)ని ప్రేమిస్తాడు. రాణికి తన ప్రేమ విషయం చెప్పాలంటే రాజుకు భయం. ఇంతలోనే ఇంటర్ పరీక్షలు అనంతరం రాణి ఉన్నత చదువుల కోసం పట్టణంకు వెళ్తుంది.రాణి మూడేళ్ల గడిచిన ఊరికి రాకపోవడంతో రాజా స్నేహితులు ఓ ప్లాన్ వేసి రాణిని ఊరు కి రప్పిస్తారు.ఊరికి తిరిగి వచ్చిన రాణికి రాజా తన ప్రేమని వ్యక్తపరిచాడా? రాణి అతని ప్రేమని ఒప్పుకుందా..? అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
మార్చు- కిరణ్ అబ్బవరం - రాజా
- రహస్య గోరక్ - రాణి
- యజుర్వేద్ గుర్రం - నాయుడు
- రాజ్ కుమార్ కసిరెడ్డి - చౌదరి
- స్నేహ మాధురి
- దివ్య నార్ని
పాటల జాబితా
మార్చు- రాజా వారు రాణిగారు , అనురాగ్ కులకర్ణి
- నమ్మేలా లేదే , అనురాగ్ కులకర్ణి
- పెయిన్ సాంగ్ , అనురాగ్ కులకర్ణి
- గెట్ వెల్ సూన్ , హరిహర సుధన్
- తిరిగి తిరిగి , జయకృష్ , రమ్య బెహరా
సాంకేతిక నిపుణులు
మార్చు- నిర్మాత: మనోవికాస్.డి
- దర్శకత్వం: కోలా రవికిరణ్
- ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల
- సంగీతం: జై క్రిష్
- పాటలు: సనాపతి భరద్వాజ్ పాత్రుడు,రాకేందు మౌళి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : వెంకట్ సిద్దా రెడ్డి, భరత్ రొంగలి
మూలాలు
మార్చు- ↑ HMTV (29 November 2019). "రివ్యూ : రాజావారు రాణిగారు". www.hmtvlive.com. Archived from the original on 22 జూన్ 2021. Retrieved 22 June 2021.
- ↑ The Hindu (29 November 2019). "'Raja Vaaru Rani Gaaru' movie review: An enjoyable romance with an old world charm". The Hindu (in Indian English). Archived from the original on 2 ఫిబ్రవరి 2021. Retrieved 22 June 2021.