రహస్య గోరక్
రహస్య గోరక్ (జననం 1995 మార్చి 26) తెలుగు, తమిళ సినిమాలలో కనిపించే భారతీయ నటి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఆమె 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె రాజావారు రాణిగారు (2019) చిత్రంలో రాణి పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.
రహస్య గోరక్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | బిట్స్, పిలానీ |
వృత్తి | నటి |
కెరీర్
మార్చుహైదరాబాదులో పుట్టి పెరిగిన రహస్య గోరక్ పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. అయితే, చిన్న వయస్సులోనే కూచిపూడి నేర్చుకున్న ఆమె నటి కావాలని అభిలాషించింది. ఆమె లక్స్ డ్రీమ్ గర్ల్ బిరుదును సంపాదించుకుంది. ఆమె ఆకాశమంత ప్రేమ, బాయ్స్ ఇన్ స్కూల్ వంటి షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. అలాగే, ఆమె బుల్లితెరపై అరంగేట్రం చేసింది. కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారుతో ఆమె తెలుగు సినిమాలోకి ప్రవేశించింది. ఆమె 2021 చిత్రం సర్బత్ లో ప్రధాన పాత్ర పోషించి తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టింది.
వ్యక్తిగత జీవితం
మార్చురహస్య గోరక్ తన మొదటి సినిమా సహనటుడు కిరణ్ అబ్బవరంతో 2024 మార్చి 13న హైదరాబాదులో నిశ్చితార్థం చేసుకుంది.[1]
మూలాలు
మార్చు- ↑ "Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్.. రహస్య పోస్ట్ వైరల్ | kiran-abbavaram-fiance-rahasya-announced-wedding-date". web.archive.org. 2024-07-15. Archived from the original on 2024-07-15. Retrieved 2024-07-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)