రాజేష్ కృష్ణన్

గాయకుడు, నటుడు

రాజేశ్ కృష్ణన్ కర్ణాటక కు చెందిన నేపథ్య గాయకుడు, నటుడు. 1991 లో వచ్చిన గౌరి గణేశ అనే చిత్రంతో తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేశ్ కన్నడ సినిమాల్లో సుమారు 4000కి పైగా పాటలు పాడాడు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 1000 కి పైగా పాటలు పాడాడు. అంతే కాక అనేక దైవభక్తి గీతాలు, వ్యాపారాత్మక సంగీతంలో పాలు పంచుకున్నాడు.

రాజేశ్ కృష్ణన్
జననం (1973-06-03) 1973 జూన్ 3 (వయసు 51)
బెంగుళూరు, కర్ణాటక
వృత్తినేపథ్య గాయకుడు
నటుడు
సంగీతకారుడు
ఎత్తు6 అ. 1 అం. (185 cమీ.)
పురస్కారాలునంది పురస్కారాలు
సైమా పురస్కారాలు

నటుడు ఎ. వి. ఎస్. దర్శకత్వంలో 2003 లో వచ్చిన ఓరి నీ ప్రేమ బంగారం కానూ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు.[1]

బాల్యం

మార్చు

రాజేశ్ కృష్ణన్ అసలు పేరు రాజేశ్వర సాయిసుబ్రహ్మణ్య నాగరాజ కృష్ణన్. 1973, జూన్ 3 న బెంగళూరు లో జన్మించాడు. తల్లి మీరా కృష్ణన్ దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. కన్నడ సంగీత దర్శకుడైన హంసలేఖ దగ్గర ట్రాక్ సింగర్ గా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాజేశ్ ముందుగా సౌమ్య రావు అనే గాయనిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత హరిప్రియ అనే డెంటిస్టును వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎంతోకాలం నిలవలేదు. తర్వాత రమ్య వశిష్ట అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.[2][3]

తెలుగు సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. జి. వి, రమణ. "ఓరి నీ ప్రేమ బంగారం కాను చిత్ర సమీక్ష". idlebrain.com. Archived from the original on 12 December 2017. Retrieved 26 December 2017.
  2. రాంచందర్. "Rajesh Krishnan marries singer Ramya Vasishta". filmibeat.com. Retrieved 26 December 2017.
  3. "Annul our marriage: Rajesh Krishnan's wife". deccanherald.com. దక్కన్ హెరాల్డ్. Retrieved 26 December 2017.