రాజ్‌కుమార్ సాంగ్వాన్
రాజ్‌కుమార్ సాంగ్వాన్ ( జననం 5 మార్చి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాగ్‌పట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజ్‌కుమార్ సాంగ్వాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | సత్య పాల్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాగ్‌పట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 5 మార్చి 1960 మీరట్ , ఉత్తరప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ లోక్‌దళ్ | ||
తల్లిదండ్రులు | సాహబ్ సింగ్, గిరిరాజో దేవి | ||
నివాసం | 306 పశ్చిమ కచేరి మార్గ్, సివిల్ లైన్స్, మీరట్ సిటీ, ఉత్తర ప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చురాజ్కుమార్ సాంగ్వాన్ చౌదరి చరణ్ సింగ్ ద్వారా రాజకీయాలలో వచ్చి 1980లో బాగ్‌పత్‌లో జరిగిన మాయా త్యాగి ఘటనతో సహా పలు రైతు & విద్యార్థుల ఉద్యమాల్లో పాల్గొని అనేకసార్లు సంగ్వాన్ జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. ఆయన ఆ తరువాత రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరి 1982లో పార్టీ మీరట్ జిల్లా ఉపాధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. రాజ్‌కుమార్ 1986లో ఆర్ఎల్‌డీ విద్యార్థి విభాగమ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1990లో మీరట్‌లోని యూత్ ఆర్‌ఎల్‌డి జిల్లా అధ్యక్షుడిగా ఆ తర్వాత యూత్ ఆర్‌ఎల్‌డిలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
రాజ్‌కుమార్ సాంగ్వాన్‌ను 1995లో చౌదరి అజిత్ సింగ్ ఆయనను జార్ఖండ్, బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమించాడు. ఆయనను ఆ తరువాత ఆర్ఎల్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. రాజ్‌కుమార్ సాంగ్వాన్ చౌదరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాగ్‌పట్ నియోజకవర్గం నుండి ఆర్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అమర్‌పాల్ పై 159459 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ "Loyalist Sangwan rewarded for his dedication". 4 March 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
- ↑ TimelineDaily (6 June 2024). "All You Need To Know About Baghpat MP-Elected Dr Rajkumar Sangwan" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "बागपत लोकसभा सीट से जीतने वाले RLD के राजकुमार सांगवान कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "2024 Loksabha Elections Results - Baghpat". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.