రాజ్ భూషణ్ చౌదరి
డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3]
జననం, విద్యాభాస్యం
మార్చురాజభూషణ్ చౌదరి జూలై 4, 1977న బెగుసరాయ్‌లో జన్మించాడు. ఆయన సమస్తిపూర్లోని హసన్పూర్ కళాశాలలో మెట్రిక్యులేషన్, ఆ తర్వాత ధన్‌బాద్‌లోని పాట్లీపుత్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత దర్భంగా మెడికల్ కాలేజీలో ఎండీ పట్టా పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చురాజ్ భూషణ్ చౌదరి 2017లో రాజకీయాల్లో వచ్చి వికాశీల్ ఇన్సాన్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆ తరువాత 2019లో ముజఫర్‌పూర్ నియోజకవర్గం నుండి వీఐపీ టికెట్‌పై పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నిషాద్పై చేతిలో 4,09,988 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022లో వీఐపీ పార్టీని వీడి బీజేపీలో చేరాడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అబ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ నిషాద్పై 2,34,927 ఓట్ల తేడాతో గెలిచి ఎంపీగా ఎన్నికై బీహార్‌లో అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎన్నికల్లో గెలిచిన తొలి నాయకుడిగా నిలిచాడు. రాజభూషణ్ చౌదరికి 6,19,749 ఓట్లు రాగా, అజయ్ నిషాద్ 3,84,822 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
రాజ్ భూషణ్ చౌదరి 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ The Hindu (9 June 2024). "Modi Cabinet 2024: List of Cabinet Ministers" (in Indian English). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The New Indian Express (9 June 2024). "Bihar gets eight ministers in Modi govt 3.0 with eye on performance, caste equation" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ एबीपी (9 June 2024). "नए मोदी कैबिनेट में बिहार से ये भी हुए शामिल, जानिए कौन हैं राजभूषण चौधरी?" (in హిందీ). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.