రాజనందిని
1957లో మిద్దే జగన్నాథరావు జలరుహ ప్రొడక్షన్స్ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా రాజనందిని అనే జానపద చిత్రాన్ని ఎన్.టి.రామారావు, అంజలిదేవి కాంబినేషన్‌లో నిర్మించాడు. ఈ చిత్రం 1958, జూలై 4వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు.
రాజనందిని (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, రేలంగి వెంకటరామయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి.వరలక్ష్మి, కృష్ణకుమారి |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | జిక్కి, ఎ.ఎం.రాజా, పిఠాపురం, పి.సుశీల, మహంకాళి వెంకయ్య, ఎం.ఎస్.రామారావు |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | జలరుహ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నందమూరి తారక రామారావు -జయచంద్రుడు
- అంజలీదేవి - రమణి
- రేలంగి వెంకటరామయ్య - గజపతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు -రామరాజు
- జి.వరలక్ష్మి - విమల
- కృష్ణకుమారి - మేనక
- రాజనాల - తిరుమల నాయకుడు
- గిరిజ - శ్రీదేవి
- కె.వి.ఎస్.శర్మ - సదానందస్వామి
- మహంకాళి వెంకయ్య - భూపతి
- ఆర్.నాగేశ్వరరావు - కిరీటి
- హేమలత - మహారాణి సుమిత్రాదేవి
- బొడ్డపాటి - భూపతి బంటు
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు, పాటలు: మల్లాది రామకృష్ణశాస్త్రి
- ఛాయాగ్రహణం- ఎం.ఎ.రహమాన్
- పోరాటాలు- కృష్ణ, రాఘవులు, బలరాం,
- కళ- తోట,
- కూర్పు- ఎన్.ఎస్.ప్రకాశం
- నృత్యం- వెంపటి సత్యం
- సంగీతం- టి.వి.రాజు
- దర్శకత్వం- వేదాంతం రాఘవయ్య
- నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
కథ
మార్చుతిరుమల నాయకుడు (రాజనాల), రామరాజు (గుమ్మడి), ఇరుగుపొరుగు రాజ్యాల ప్రభువులు, రామరాజు కుమారుడు జగచంద్రుడు (ఎన్.టి.రామారావు) తిరుమల నాయకుని కుమార్తె శ్రీదేవి (గిరిజ) ఆమె తల్లి మరణించగా, సదానందస్వామి (కె.వి.ఎస్.శర్మ) కుమార్తె విమల (జి.వరలక్ష్మి) పసిప్రాయంనుంచి శ్రీదేవిని కోటలో పెంచి పెద్దచేస్తుంది. తిరుమల నాయకుని రాజ్యంలో, భూపతి (మహంకాళి వెంకయ్య) అదే దోపిడి దొంగ, మహారాజు ప్రాపకంతో విరివిగా దోపిడీలు సాగిస్తూ మహారాజుకు కొంత సమర్పిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. రామరాజు రాజ్యంలోప్రజలు ఈ దోపిడీలవల్ల పలు బాధలుపడడం చూసిన యువరాజు, తండ్రి అనుమతితో రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదురుస్తానని బయలుదేరతాడు. దేవీ ఆలయంలో అతన్ని చూసి యువరాణి ముచ్చటపడి, కోటలోకి ఆహ్వానిస్తుంది. ఒక వీధి నృత్యం చేస్తున్న భూపతి కుమార్తె రమణి (అంజలిదేవీ) జయచంద్రుని చూసి ప్రేమించి, అతన్ని పొందాలని తన బావ కిరీటి (ఆర్.నాగేశ్వరరావు) దండుతో కలిసి, జయచంద్రుడు వెళ్ళిన సొరంగ మార్గం ద్వారా కోటలో ప్రవేశించి, తిరుమల నాయకుని బంధించి, గాయపడిన జయచంద్రుని తన మందిరంలో చేరుస్తుంది. అతనికి తన ప్రేమను తెలియచేస్తుంది. కాని, జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరించడు. తిరుమల నాయకుని విడిపించాలని, సదానందస్వామి తన శిష్యుడు గజపతి (రేలంగి)సాయంతో పథకం వేసి కోటలో ప్రవేశించినా, భూపతి వారినెదుర్కొని మహారాజును వధిస్తాడు. దాంతో పగబట్టిన విమల భూపతిని ప్రేమించినట్లు నటించి, ఓ నృత్యంలో అతన్ని అంతంచేస్తుంది. విమల ద్వారా కారణం గ్రహించిన రమణి, ఆమెను క్షమించి, బందీగావున్న శ్రీదేవిని విడిపించి ఆమెకు రాజ్యాన్ని అప్పగిస్తుంది. రమణి త్యాగబుద్ధి మెచ్చిన జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఇది సహించలేని శ్రీదేవి, రమణిని, చంపబోయి, విమలను హత్యచేస్తుంది. రమణితో కలిసి తమ రాజ్యానికి వెళ్ళిన జయచంద్రుని తల్లి ఆదరిస్తుంది. కోపంతో శ్రీదేవి, రమణి, విమలను చంపి జయచంద్రుని పారిపోయి వచ్చిందని లేఖను పంపిస్తుంది. దాంతో మహారాజు కోపంతో రమణిని వెళ్ళగొడతాడు. జయచంద్రుడు ఆమెకోసం వెళ్ళటం, రమణిని చేజిక్కించుకున్న కిరీటితో పోరాడగా, ఆ పోరులో కిరీటి అంతంఅవుతాడు. రమణిని చంపాలని ప్రయత్నించిన శ్రీదేవి ఓ కొండ రాయి క్రిందపడి మరణిస్తుంది. నిజం తెలిసిన మహారాజు తన బలగంతో వచ్చి, రమణిని క్షమాపణకోరి, ఆమెను రాజనందినిగా ఆశీర్వదించి, తన కుమారునితో వివాహ నిశ్చయం చేయటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].
పాటలు
మార్చు- అందాలు చిందు సీమలో ఉండాములే హాయిగా - జిక్కి, ఎ.ఎం.రాజా
- ఎందుకు చెప్పలేను తందానా తాన ఏమై పోవాలో తానా తందానా - పిఠాపురం
- కథ నాకు తెలుసోయి నీ కథ నాకు తెలుసోయి అందాల - పి.సుశీల
- కొమ్మమీద కోయిలుందిరా సినవోడా కొ అంటే పలుకుతుందిరా - జిక్కి
- చిక్కవులేరా చక్కని రాజా సినడానికి సేతికి నీవు - జిక్కి, మహంకాళి వెంకయ్య
- చెంగున ఎగిరే లేడి కూనను కన్నె లేడి కూనను చురకోరల పులిరాజా - జిక్కి
- నిన్నే నిన్నే నిన్నేనోయి నిన్నే కోణంగి రాజా - జిక్కి
- నీటైన సినవోడా నిన్నే నమ్ముకొంటినోయి సివురంటి సిన్నదానినోయి - జిక్కి
- నీమీద మనసాయేరా ఓ రేరాజా నీ దానరా నన్ను కన్నార మన్నించరా - పి. సుశీల
- రంగేళి రౌతంటే నీవేరా వీరా సింగారి చూపంటే నీదేరా ధీరా - పి. సుశీల బృందం
- శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగా హరోం హర - పిఠాపురం బృందం
- హర హర పురహర శంబో హిమధరణీధర రాజనందినీ - ఎం.ఎస్.రామారావు బృందం
- జలరుహ మృదుపాణి భవానీ జేజే జగజ్జననీ -
మూలాలు
మార్చు- ↑ "రాజనందిని -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 04-08-2018". Archived from the original on 2018-08-25. Retrieved 2018-10-30.