మహంకాళి వెంకయ్య
మహంకాళి వెంకయ్య (1917 - 1979), కూచిపూడి నాట్యాచార్యుడు[1], 1950, 60వ దశకములో తెలుగు సినిమా నటుడు. ఈయన 45 సంవత్సరాలపాటు నాటకరంగానికి, 32 యేళ్లు సినిమారంగానికి సేవచేశాడు. సుమారు 158 సినిమాలలో నటించాడు. ఈయన దక్షయజ్ఞం, భూకైలాస్, భక్త మార్కండేయ, చిరంజీవులు, సీతాకళ్యాణము, ఆరాధన వంటి సినిమాలలో నటించాడు.
జీవిత విశేషాలుసవరించు
ఇతడు 1917లో కూచిపూడి గ్రామంలో మహంకాళి సుబ్బయ్య, పుణ్యవతి దంపతులకు జన్మించాడు. ఇతడు 9వ యేటనే మొఖానికి రంగు పూసుకున్నాడు. 17వ యేడు వచ్చేసరికి నాటకరంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. భాగవతుల కుమారస్వామి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు[2]. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకటరామయ్య వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత వేదాంతం రాఘవయ్య ట్రూపులో చేరి హిరణ్యకశిపుడు, కంసుడు వంటి పాత్రలను, డి.వి.సుబ్బారావు నాటకాలలో విశ్వామిత్రుడు వంటి విభిన్నమైన పాత్రలను ధరించి పేరుపొందాడు. ఆంధ్రరాష్ట్రంలోనే కాక కన్నడ, తమిళ రాష్ట్రాలలో కూడా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. పౌరాణిక నాటకాలే కాక కాటమరాజు కథ, ఖిల్జీపతనం, బాలనాగమ్మ, ఛైర్మన్ మొదలైన నాటకాలలో నటించాడు. 1946లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన వింధ్యరాణి సినిమాలో ఒక చిన్న వేషం వేయడం ద్వారా సినిమారంగంలో ప్రవేశించాడు. మరణించేవరకు 158 చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించాడు[2].
నటించిన సినిమాలుసవరించు
- వింధ్యరాణి (1948)
- సీతాకళ్యాణము
- అదృష్టదీపుడు (1950)
- మాయా రంభ (1950)
- మల్లీశ్వరి (1951) - శ్రీకృష్ణదేవరాయల సేనాధిపతి రామలింగ నాయకుడు.
- టింగ్ రంగా (1952)
- పెళ్ళి చేసి చూడు (1952) - భీమన్న
- గుమాస్తా (1953) - జమీందారు
- జయసింహ (1955)
- చిరంజీవులు (1956)
- భక్త మార్కండేయ (1956)
- సొంత ఊరు (1956)
- కుటుంబ గౌరవం (1957)
- మాయాబజార్ (1957)
- ఇంటిగుట్టు (1958)
- భూకైలాస్ (1958)
- రాజనందిని (1958)
- ఆరాధన (1962)
- గులేబకావళి కథ (1962)
- దక్షయజ్ఞం
- పూజాఫలం (1964)
- సతీ సక్కుబాయి (1965)
మరణంసవరించు
ఇతడు తన 62వయేట కూచిపూడి గ్రామంలో 1979, జనవరి 27వ తేదీన మరణించాడు[2].