రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి
రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని పెద్ద వాల్తేరులో ఉన్న పిల్లల ఆసుపత్రి.[1]
రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | పెద్ద వాల్తేరు, విశాఖపట్టణం, భారతదేశం |
వ్యవస్థ | |
[యూనివర్సిటీ అనుబంధం | ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం |
Services | |
అత్యవసర విభాగం | yes |
పడకలు | 100 |
హెలిపాడ్ | No |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1965 |
చరిత్ర
మార్చుఈ ఆసుపత్రి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని 1965 సంవత్సరంలో చెముడు రాణి తన ఇష్టానుసారం విరాళంగా ఇచ్చింది. 20 పడకలతో ప్రారంభించబడిన ఈ ఆసుపత్రి, ఆ తరువాతికాలంలో 100 పడకలకు విస్తరించబడింది.[2]
జీవవైవిధ్య ఉద్యానవనం
మార్చువిశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సహకారంతో డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ[3][4] ద్వారా రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రిగా బయోడైవర్సిటీ పార్క్ నిర్వహించబడుతుంది. 2002లో ఈ ఉద్యానవనం ఏర్పాటుచేయబడింది, 2000 జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి.[5] 3 ఎకరాల విస్తీర్ణంలో విస్తీర్ణంలో 10 ప్రధాన విభాగాలతో ఈ ఉద్యానవనం ఉంది. ఇందులో ఔషధ & సుగంధ, జురాసిక్ యుగం నుండి జీవ శిలాజాలు, క్రిమిసంహారక, ఆర్కిడ్లు, కాక్టి & సక్యూలెంట్లు, పవిత్రమైన తోటలు, ఫెర్న్లు, జలచరాలు, వెదురు & తాటి తోటలు ఉన్నాయి.[6] పిచర్ ప్లాంట్, మిక్కీ మౌస్, కృష్ణుని వెన్న కప్పు, హోలీ క్రాస్, జీసస్ స్మైల్, తలక్రిందులుగా ఉన్న చెట్టు, ఆటోగ్రాఫ్, జేమ్స్ బాండ్ 007 పైప్, లాఫింగ్ బుద్ధ, జింగో బిలోబా వంటి అరుదైన మొక్కలను కలిగి ఉంది.[7] ఇందులో 100 కంటే ఎక్కువ జాతుల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి.[8] ఈ ఉద్యానవనం ఆసుపత్రిలోని రోగులకు మంచి వాతావరణాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.[9]
మూలాలు
మార్చు- ↑ "location of the hospital". timesofindia. 23 Oct 2018. Retrieved 21 Jan 2019.
- ↑ "history". The Hindu. 13 Feb 2003. Archived from the original on 17 September 2003. Retrieved 29 Mar 2019.
- ↑ "fascinating world of plant kingdom amid concrete jungle-educational park". thehindu. 29 July 2017. Retrieved 22 April 2020.
- ↑ "DNCS Biodiversity park". Yo Vizag. 25 Mar 2018. Retrieved 9 Jan 2020.
- ↑ "RCD Hospital biodiversity park". timesofindia. 24 May 2017. Retrieved 31 Mar 2019.
- ↑ "Generation Y to conserve biodiversity-sections of biodiversity park". timesofindia. 4 December 2012. Retrieved 21 April 2020.
- ↑ "in the kingdom of plants-rare species Ginkgo biloba-of biodiversity park". thehindu. 18 July 2018. Retrieved 22 April 2020.
- ↑ "biodiversity park with more than 100 species of butterflies". thehindu. 17 August 2018. Retrieved 26 April 2020.
- ↑ "breathing new life-salubrious climate to patients". frontline. 19 May 2006. Retrieved 22 April 2020.