రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్

రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్

పదవీ కాలం
16 మే 2014 – 3 జూన్ 2024
ముందు మహేంద్రసింగ్ చౌహాన్
తరువాత శోభనాబెన్ బరయ్య
నియోజకవర్గం సబర్కంటా

వ్యక్తిగత వివరాలు

జననం (1952-06-01) 1952 జూన్ 1 (వయసు 72)
భాగ్‌పూర్, సబర్‌కాంత జిల్లా, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శంకర్‌సిన్హ్ రఘుసింహ, మోతబా
జీవిత భాగస్వామి శాంతిబా రాథోడ్ (మ. 4 మే 1963)
సంతానం 3
నివాసం భాగ్‌పూర్, సబర్‌కాంత జిల్లా, గుజరాత్
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

దీప్‌సిన్హ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 నుండి 2007 వరకు రెండుసార్లు  శాసనసభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2002 గుజరాత్ శాసనసభలో ఓబీసీ కమిటీ ఛైర్మన్‌గా, సభ, ప్రణాళిక, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌సింగ్ వాఘేలాపై 84,455 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2014 నుండి 2019 వరకు జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యుడిగా, 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు పార్లమెంట్‌లో వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మరియు తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

దీప్‌సిన్హ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ రాజేంద్రసింగ్ శివసింగ్ పై 2,68,987 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి 27 డిసెంబర్ 2020 వరకు పార్లమెంట్‌లో నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 23 అక్టోబర్ 2019 నుండి జూన్ 2024 వరకు వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 28 డిసెంబర్ 2020 నుండి జూన్ 2024 వరకు శక్తిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. "Sabarkantha Election Results 2019: BJP Rathod Dipsinh won by 2.68 lakh votes and will be Sabarkantha MP" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. The Indian Express (23 May 2019). "Sabarkantha Lok Sabha Election Results 2019 LIVE Updates: BJP's Rathod Dipsinh Shankarsinh wins" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Firstpost (23 May 2019). "Sabarkantha Lok Sabha Election Result 2019 LIVE updates: Rathod Dipsinh Shankarsinh of BJP wins" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.