రాధిక కుమారస్వామి

రాధిక కుమారస్వామి (జ. 1986 నవంబరు 11 [3][4]), భారతీయ సినిమా నటి, నిర్మాత.[5] ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.[6]

రాధిక కుమారస్వామి
జననం (1986-11-11) 1986 నవంబరు 11 (వయసు 37)
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

జీవితం

మార్చు

రాధికా తన సినిమా ప్రస్థానాన్ని కన్నడ చిత్రం "నీల మేఘ శ్యామ"(2002) తో ప్రారంభించింది. ఆ చిత్రంలో నటించినపుడు ఆమె 9వ తరగతి మాత్రమే పూర్తిచేసింది. [3] ఆమె నటించిన సినిమాలలో మొదటగా విడుదల అయినది విజయ్ రాఘవేంద్ర సరసన నటించిన "నినగాగి". తరువాత ఆమె శివరాజ్‌కుమార్ తో "తవరిగె బా తంగి" సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందించాయి. [3]2003 లో ఆమె కన్నడ చిత్రసీమలో ఐదు చిత్రాలలో కనిపించింది. వాటిలో హేమంత్ హెగ్డే దర్శకత్వంలోణి "ఊ లా లా:హుడుగిగాగి"[7]; ఎస్. పి. చరణ్, యోగ్రాజ్ భట్ లకు మొదటి సినిమా కూదా "మణి". దీనిలో ఆమె ఒక వేశ్య కుమార్తెగా నటించింది. [3] తరువాత నటించిన "మనె మగలు", "తయి ఇల్లడ తబ్బాలి" చిత్రాలు వాణిజ్య పరంగా వైఫల్యాలు పొందాయి.[8] ఈ చిత్రాలలో పేలవమైన బాక్స్ ఆఫీస్ రిటర్న్ ఉన్నప్పటికీ, ఆమె నటించిన "తాయి ఇల్లడ తబ్బాలి" చిత్రంలోని గౌరి పాత్ర లోని నటనకు కర్నాటక రాష్ట్ర ఉత్తమ నటిగా సినిమా పురస్కారాన్ని అందుకుంది.[9][10]

కన్నడ చిత్రాలలో వరుస వైఫల్యాలు చెందడం వలన ఆమె తమిళ చిత్రసీమలోనికి ప్రవేశించి, ఐదు చిత్రాలలో నటించింది. [11] ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం "ఇయర్‌కాయ్" (2003). ఈ చిత్రానికి సినిమా పురస్కారాలు వచ్చాయి. హిందూ పత్రిక తన సమీక్షలో "ఉద్రిక్త, పరిపక్వత, అమాయకురాలైన నాన్సీ పాత్రకు ఆమె సరైనది" అని పేర్కొంది. [12] 2005లో ఆమె నటించిన నాలుగు చిత్రాలలో మూడు సినిమాలు "రిషిని", "మసాలా", "ఆటోశంకర్" లలో మరో ప్రధాన మహిళా పాత్రతో ఆమె నటించింది. [13] 2005 లో ఆమె నటించిన చివరి చిత్రం "తవరిగె బా తంగి" లో ఆమె శివరాజ్‌ కుమార్ కు సోదరిగా నటించింది. [14] తరువాత సంవత్సరం ఆమె ఐదు కన్నడ, ఒక తమిళ చిత్రంలో నటించింది. ఆమె నటించిన "హతవిధి" పై రెడిఫ్ డాట్ కాం చేసిన సమీక్షలో ""ఇది రవిచంద్రన్ చిత్రం అయినప్పటికీ, రాధిక యొక్క గొప్పతనం, ఆమె అద్భుతమైన ప్రదర్శనను చూపిస్తుంది, ఆమె భావోద్వేగాలు పరిపూర్ణమైనవి, ఆమె తెరపై బాగా అందంగా ఉంది." తెలియజేసింది.[15] చాలాకాలం చిత్రసీమకు దూరమైన తరువాత ఆమె 2008లో "నవశక్తి వైభవం" అనే భక్తి చిత్రంలో దేవత పాత్రలో నటించింది.

ఆమె సినిమా పరిశ్రమలో నిర్మాతగా, పంపిణీదారురాలిగా కూడా పనిచేసింది. ఆమె ఉపేంద్ర, దర్శని లతో పాటు నటించిన తన స్వంత చిత్రం "అనతరు" (2007) పంపిణీ హక్కులను పొందింది.[16] 2008లో ఆమె తన చిత్రం "ఈశ్వర్" కు హక్కులు కొనుగోలు చేసింది. ఇది పునరుద్ధరించబడి[17] [18]2007 లో "నరసింహ" గా విడుదల అయింది. [17][19] తరువాత ఆమె తన కుమార్తె పేరుతో "షమిక ఎంటర్‌ప్రైజెస్" పేరుతో ఒక స్టుడియోను స్థాపించి, "లక్కీ" సినిమాకు దర్శకత్వం వహించింది.

2013లో ఆమె నిర్మించిన "స్వీటీ నాన్న జోడి" చిత్రంలో నటించింది. [20] ఆమె తెలుగు లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2014 విడుదలైన పౌరాణిక చిత్రం "అవతారం" లో నటించింది. [21]

వ్యక్తిగత జీవితం

మార్చు

రాధిక 2000 నవంబరు 26 న కటీల్ లోని శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంలో రతన్ కుమార్ ను వివాహమాడింది. [22] 2002 ఏప్రిల్ లో రతన్ కుమార్ రాధిక తండ్రి రాధికక్లు వివాహం జరిగిన విషయం "ఆమె కెరీర్ ను అంతమవుతుంది" అనే భయంతో ఆమెను అపహరించాడనే ఆరోపణలతో కేసు పెట్టాడు. [23][24] కొన్ని రోజుల తరువాత, రాధికకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నందున రాధిక తల్లి ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ వివాహాన్ని రతన్ కుమార్ బలవంతంగా చేసుకున్నాడని తెలిపారు.[25] రతన్ కుమార్ రాధికను సజీవ దహనం చేయాలనుకున్నాడని అరోపించాడు.[25] 2002 ఆగస్టు లో రతన్ గుండెపోటుతో మరణించాడు.[22] 2010 నవంబరులో రాధిక కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి ని వివాహం చేసుకుంది.[26][2][6] రాధిక చెప్పినదాని ప్రకారం ఆ వివాహం 2006లో జరిగింది.[27][28] వారికి ఒక కుమార్తె "షమిక కె.స్వామి" ఉన్నది. [29][30]

చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర కథానాయకుడు భాష వివరణ
2002 నిన్నగాగి మధు విజయ రాఘవేంద్ర కన్నడ
నీలమేఘశ్యామ నీలమేఘ సృజన లోకేష్
తవరిగే బా తంగి లక్ష్మీ శివ రాజకుమార్
ప్రేమ ఖైదీ నందిని విజయ రాఘవేంద్ర
రోమియో జూలియట్
2003 ఊ లాలా కృష్ణమోహన్
హడుగిగాగి ఎస్. పి. చరణ్
మణీ మయూర్ పాటెల్
మానే మగలు విశాల్ హెగ్డే
తాయీ ఇల్లడ తబ్బాలీ గౌరి శివధ్వజ్ కర్ణాటక రాష్ట్ర సినిమా పురస్కారం (ఉత్తమ నటి)
యార్కాయి నాన్సీ అరుణ్ విజయ్ శ్యాం తమిళం
2004 వర్నజాలం అనిత శ్రీకాంత్ తమిళం
భద్రాద్రి రాముడు సీత తారకరత్న తెలుగు
మీసాయి మాధవన్ రాణి రమణ తమిళం
2005 రిషి స్ఫూర్తి విజయ రాఘవేంద్ర కన్నడ
మసాల సుమ సునీల్ రావు

విశల్ హెగ్డే

ఆటో శంకర్ ఉపేంద్ర
అన్న తంగి లక్ష్మీ శివరాజ్ కుమార్
సొల్లత్తుమ గౌరి తమిళం
2006 మండ్య గంగ దర్శన్ కన్నడ
హత్తెవార కనసు మయూర్ పటేల్
హటవది అమిష రవిచంద్రన్
ఉల్ల కదతాల్ రమ్య విఘ్నేష్ తమిళం
గుడ్ లక్ మందాకిని అనిరుధ్ కన్నడ
ఒడనుట్టి డవలు వి.రవిచంద్రన్
2007 అనతరు మంజు దర్శాన్
జనపద రాఘ రాఘవ
అమృతవాణి సుమతి,

అమృతవాణి

నవీన్ కృష్ణ

అజయ్ రావు

2008 నవశక్తి వైభవ కాటిలు దుర్గ ఎవరూ కాదు
2013 స్వీటీ నాన్న జోడి ప్రియ ఆదిత్య సింగ్
2014 అవతారం[31] రాజేశ్వరి సత్య ప్రకాష్ తెలుగు
2015 రుద్ర తాండవ జాహ్నవి చిరంజీవి సర్జ కన్నడ [32]
2018 కోంట్రాక్ట్ అర్జున్ సర్జా నిర్మాణంలో[33]
బైరా దేవి రమేష్ అరవింద్

స్కద్ అశోక్

నిర్మాణంలో
రాజేంద్ర పోనప్ప వి.రామచంద్రన్ నిర్మాణంలో
నిమగాగి విజయ్ రాఘవేంద్ర నిర్మాణంలో

టెలివిజన్

  • 2017 - డాన్స్ డాన్స్ జూనియర్స్ - జడ్జి - స్టార్ సువర్ణ
నిర్మాతగా
సంవత్సరం సినిమా భాష నటులు
2012 లక్కీ కన్నడ యాష్, రమ్య
2013 స్వీటీ నాన్న జోడి కన్నడ ఆదిత్య , రాధిక

మూలాలు

మార్చు
  1. "Actress Radhika's 'husband' dies of heart attack". The Times of India. 27 August 2002.
  2. 2.0 2.1 "I'm Mrs Kumaraswamy: Radhika". The Times of India. 21 November 2010. Archived from the original on 2012-11-06. Retrieved 2018-05-21.
  3. 3.0 3.1 3.2 3.3 "Big time for li'l girl". The Hindu. Chennai, India. 5 August 2005. Archived from the original on 15 సెప్టెంబరు 2006. Retrieved 21 మే 2018.
  4. "Ooh La La La: Fun on the Kannada screen – The Times of India". The Times of India.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 May 2018). "తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి". www.andhrajyothy.com. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.
  6. 6.0 6.1 "Radhika breaks her silence". Sify. Archived from the original on 1 July 2016. Retrieved 21 May 2016.
  7. "Ooh La La La: Fun on the Kannada screen – The Times of India". The Times of India.
  8. "A year of highs and lows - Deccan Herald". Archived from the original on 3 June 2016. Retrieved 21 May 2016.
  9. "'Chigurida Kanasu' bags 4 awards". The Times of India. 1 January 2005. Archived from the original on 2012-10-25. Retrieved 2018-05-21.
  10. "Entry only to invitees at film awards function". The Hindu. Chennai, India. 15 July 2005. Archived from the original on 2 November 2013. Retrieved 21 May 2018.
  11. "Welcome to Sify.com". Archived from the original on 1 July 2016. Retrieved 21 May 2016.
  12. "Iyarkai". The Hindu. Chennai, India. 21 November 2003. Archived from the original on 26 నవంబరు 2003. Retrieved 21 మే 2018.
  13. "IndiaGlitz – Radhika game for two-heroine films – Kannada Movie News". Archived from the original on 2015-09-24. Retrieved 2018-05-21.
  14. "Brother-sister duo is back - Deccan Herald - Internet Edition". Archived from the original on 4 March 2016. Retrieved 21 May 2016.
  15. "Hatavadi: For Ravichandran fans and more". Retrieved 21 May 2016.
  16. "Going great guns". Sify. Archived from the original on 27 September 2015. Retrieved 21 May 2016.
  17. 17.0 17.1 "Controversial Radhika is back!". Sify. Archived from the original on 27 September 2015. Retrieved 21 May 2016.
  18. "Radhika buys Ishwar". Archived from the original on 14 ఫిబ్రవరి 2008. Retrieved 21 May 2016.
  19. "I miss facing the arclights: Radhika Kumaraswamy". The Times of India. 31 December 2011. Archived from the original on 2012-07-15. Retrieved 2018-05-21.
  20. "Radhika Kumaraswamy isn't scared of competition". News18. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 21 May 2016.
  21. "Avatharam Movie Review - Avatharam Telugu Movie Review - 123telugu.com". Retrieved 21 May 2016.
  22. 22.0 22.1 "Actress Radhika's 'husband' dies of heart attack". The Times of India. 27 August 2002. Archived from the original on 2013-08-12. Retrieved 2018-05-21.
  23. "Court warrant to trace Kannada actress Radhika". The Times of India. 18 April 2002. Archived from the original on 2013-12-19. Retrieved 2018-05-21.
  24. "Husband, father fight over actress". Retrieved 21 May 2016.
  25. 25.0 25.1 "Husband's story flops, 'abducted'". Retrieved 21 May 2016.
  26. Andhra Jyothy (15 May 2023). "మాజీ ముఖ్యమంత్రి భార్య తెలుగు సినిమాలో..." Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
  27. "I'm Mrs Kumaraswamy: Radhika". The Times of India. 21 November 2010. Archived from the original on 2012-11-06. Retrieved 2018-05-21.
  28. "Radhika Kumarswamy goes open on her Connections". Archived from the original on 4 March 2016. Retrieved 21 May 2016.
  29. Gowda, Aravind. "Kumaraswamy in trouble". India Today. Retrieved 10 April 2014.
  30. http://www.deccanchronicle.com/entertainment/sandalwood/260417/radhika-kumaraswamy-rads-to-filmi-riches.html
  31. సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.
  32. "Radhika Kumarswamy to play Lakshmi Menon in Rudratandava". The Times of India. 26 February 2014. Retrieved 3 March 2014.
  33. "Kontract revived with many surprises". The New Indian Express. 29 March 2017. Archived from the original on 1 ఏప్రిల్ 2017. Retrieved 31 March 2017.

బయటి లంకెలు

మార్చు