అవతారం (2014 సినిమా)
అవతారం 2014, ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు భక్తిరస చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి, భానుప్రియ, రిషి నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[1] సింహరాశిలో పుట్టిన అమ్మాయికోసం అక్కమ్మ దేవత ఒక రాక్షసుడిని ఎలా ఓడించిందన్న కథాంశంతో చిత్రం రూపొందింది.[2][3] ఇది తమిళంలో మీండుమ్ అమ్మన్ పేరుతో, హిందీలో ది పవర్ అవతారంగా విడుదలైంది.
అవతారం | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | కోడి రామకృష్ణ, రాజేంద్రకుమార్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | కోడి రామకృష్ణ |
నిర్మాత | ఎం. యుగేందర్ రెడ్డి |
తారాగణం | రాధిక కుమారస్వామి భానుప్రియ సత్య ప్రకాష్ రిషి బలిరెడ్డి పృథ్వీరాజ్ అన్నపూర్ణ |
ఛాయాగ్రహణం | శ్రీ వెంకట్ |
కూర్పు | హరి నందమూరి |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
విడుదల తేదీ | 18 ఏప్రిల్ 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | INR 80,000,000 (అంచనా) |
కథా నేపథ్యం
మార్చుఅక్కమ్మ దేవత (భాను ప్రియ) ఎనిమిది కొండలపై వెలసివుంటుంది. గరుల కోట శక్తులు బంధించడంతో అక్కమ్మ దేవతకు శక్తులు లేకుండా పోయాయి. సింహరాశిలో పుట్టిన వారు తమకు తాముగా అగ్నికి బలైతే ఆ గరుల కోట శక్తుల నుంచి అక్కమ్మ దేవతకు విముక్తి లభిస్తుంది. అందుకోసం, చిన్ననాటి నుంచి అక్కమ్మ దగ్గరే పుట్టి పెరిగిన నలుగురు అక్కచెల్లెళ్ళు అగ్నికి బలై అక్కమ్మని దుష్టశక్తుల చెర నుండి విడిపిస్తారు. ఆ తరువాత అక్కమ్మ, ఆ నలుగురిని తన చెల్లెళ్ళుగా స్వీకరించగా, ఈ ఐదుగురు కలిసి ఆ గ్రామాన్ని కాపాడుతుంటారు. అదే గ్రామంలో పుట్టిన రాజేశ్వరి (రాధిక) ఈ అక్కమ్మ చెల్లెళ్ళను పూజిస్తూ ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. గ్రామంలోని రాజా కుటుంబానికి చెందిన ప్రసాద్ (రిషి) బంధువులు ఆస్తి కోసం ప్రసాద్ ని పిచ్చివాడిని చేస్తారు. రాజేశ్వరి అతన్ని మార్చే ప్రయత్నంలో 1000 సంవత్సరాలకు వచ్చే అన్ని గ్రహాల కూటమి వల్ల కర్కోటకుడు (సత్య ప్రకాష్) భూమిపైకి వస్తాడు. భూ ప్రపంచాన్ని నాశనం చేసి తన వశం చేసుకోవాలనుకున్న కర్కోటకుడి సింహరాశిలో పుట్టిన రాజేశ్వరి వల్ల తనకు మరణగండం ఉందని తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4]
నటవర్గం
మార్చు- రాధిక కుమారస్వామి (రాజేశ్వరి)[5]
- భానుప్రియ (అక్కమ్మ దేవత)
- సత్య ప్రకాష్ (కర్కోటకుడు)
- రిషి (ప్రసాద్)
- బలిరెడ్డి పృథ్వీరాజ్
- అన్నపూర్ణ
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: ఎం. యుగేందర్ రెడ్డి
- మాటలు: రాజేంద్రకుమార్
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- ఛాయాగ్రహణం: శ్రీ వెంకట్
- కూర్పు: హరి నందమూరి
పాటలు
మార్చుఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "వేవేల జేజేలివే" | కె. ఎస్. చిత్ర | 5:18 |
2. | "నాలుగు దిక్కుల" | కె.ఎస్. చిత్ర | 5:18 |
3. | "విభ్రాంతి గొలుపు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 0:55 |
4. | "పదునాలుగు లోకాలు" | రీనా | 1:00 |
5. | "మృత్యుంజేయేశ్వరిణి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 0:54 |
6. | "కడుపుతీపి కన్నతల్లిఏ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 1:24 |
7. | "మబ్బుల్లో ఊరేగే" | మాళవిక, ఘంటాడి కృష్ణ | 4:52 |
8. | "సౌభాగ్యదేవికే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 6:52 |
మొత్తం నిడివి: | 26:33 |
మూలాలు
మార్చు- ↑ సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. Archived from the original on 29 July 2020. Retrieved 29 July 2020.
- ↑ "Avatharam review: Avatharam (Telugu) Movie Review - fullhyd.com". Movies.fullhyderabad.com. 2014-04-18. Retrieved 2020-07-29.
- ↑ "Avatharam Movie Review | Avatharam Telugu Movie Review". 123telugu.com. 2014-04-18. Retrieved 2020-07-29.
- ↑ 123 తెలుగు, సినిమా రివ్యూ (18 April 2014). "అవతారం సినిమా రివ్యూ". www.123telugu.com. Retrieved 29 July 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 May 2018). "తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి". www.andhrajyothy.com. Archived from the original on 29 July 2020. Retrieved 29 July 2020.