రామకృష్ణులు
రామకృష్ణులు 1978లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. అడవిరాముడు చిత్రం వచ్చి విజయవంతమయ్యాక, తొలిసారిగా ఎన్.టి.ఆర్ తో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం నిర్మించారు. అక్కినేని, నందమూరి ఈ చిత్రంలో పాటలు మాటలూ ఫైట్లూ అన్నీ సమంగా పంచుకున్నారు. కథలో కొంతభాగం హిందీ చిత్రం 'హేరాఫేరీ' నుంచి తీసుకున్నారు.
రామకృష్ణులు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.బి. రాజేంద్ర ప్రసాద్ |
---|---|
రచన | వి.సి. గుహనాథన్ |
తారాగణం | నందమూరి తారకరామారావు, జయసుధ, అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, అంజలీదేవి, జగ్గయ్య, ధూళిపాళ, పుష్పలత, రాజబాబు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, మోహన్‌బాబు, శరత్‌బాబు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | జగపతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటల జాబితా
మార్చు- అబ్బబ్బోఆడవాళ్ళు, రచన.ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, వాణి జయరాం, వి.రామకృష్ణ.
- కన్నేఎవరో , రచన, ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ
- హరేరామ హరేకృష్ణ, రచన.ఆచార్యఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల,వాణి జయరాం, వి.రామకృష్ణ
- నవ నవలాడే చిన్నదాన, రచన.ఆచార్య ఆత్రేయ, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- దుప్పట్లో దూరాక , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.వి.రామకృష్ణ , పి.సుశీల
- హాయ్ హాయ్ అంటుంటే , రచన: ఆచార్య ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వి. రామకృష్ణ
- ఆడనా పాడనా , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల, వాణి జయరాం.