రామచంద్ర ప్రసాద్ సింగ్

రామచంద్ర ప్రసాద్ సింగ్ (జననం 1958 జులై 6) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు.[1] ఇతను 2010 నుండి బీహార్ రాష్ట్రనుండి రాజ్యసభ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఇతను రాజకీయాల్లో చేరడానికి ముందు ఉత్తర్ ప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారి.[2][3]

Ramchandra Prasad singh.jpg
సంభాషిస్తున్న రామచంద్ర ప్రసాద్ సింగ్

2021 జులై 7న క్యాబినెట్ సమగ్రత జరిగినప్పుడు రెండవ మోడీ మంత్రిత్వ శాఖలో ఉక్కు మంత్రిత్వ శాఖకి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

సింగ్ బీహార్ లోని నలంద జిల్లాలోని ముస్తఫాపూర్ లో సుఖ్దేవో నారాయణ్ సింగ్, దుఖాలలో దేవి దంపతులకు జన్మించాడు. అతను నలందాలోని హుస్సేన్పూర్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. పాట్నా కాలేజీ నుండి చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పట్టా పొందాడు ఆ తరువాత న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ విద్య పూర్తి చేసాడు. 1982 మే 21న గిరిజా సింగ్‌తో ఇతని వివాహమైంది, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతని కుమార్తె లిపి సింగ్ 2016 బ్యాచ్ ఐపిఎస్ అధికారి.[4]

మూలాలు

మార్చు
  1. Karthikeyan, Suchitra (27 December 2020). "JDU chooses Nitish Kumar's close aide RCP Singh as party chief, amid tiff with ally BJP". Republic World. Retrieved 27 December 2020.
  2. Nalin Verma (1 June 2010). "RS reward for Nitish's trusted RCP". Telegraph. Retrieved 18 December 2018.
  3. Ahmad, Soroor (1 June 2019). "Bihar: JDU leaders unhappy with the new cabinet of Modi Sarkar 2". National herald. Retrieved 31 October 2020. According to JD(U) sources, the party wanted cabinet berths for former bureaucrat and Rajya Sabha member R C P Singh and newly-elected MP from Munger Rajiv Ranjan Singh alias Lalan Singh and MoS status for Purnea MP Santosh Kushwaha.R C P Singh is a Kurmi and also comes from Nitish Kumar's home district of Nalanda, Lalan is a Bhumihar and Santosh a Kushwaha. The party cannot afford to lose the goodwill of any other two castes by nominating only one minister. Thus it deemed it fit not to join the government at all, said a party leader.
  4. Singh, Rohit Kumar (23 August 2019). "Lady Singham: How this Bihar woman cop made 'bahubali' MLA Anant Singh flee for his life". India Today (in ఇంగ్లీష్). Retrieved 23 August 2019.