రామతీర్ధం (చీమకుర్తి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

రామతీర్ధం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రామతీర్ధం (చీమకుర్తి)
గ్రామం
పటం
రామతీర్ధం (చీమకుర్తి) is located in ఆంధ్రప్రదేశ్
రామతీర్ధం (చీమకుర్తి)
రామతీర్ధం (చీమకుర్తి)
అక్షాంశ రేఖాంశాలు: 15°36′2.664″N 79°48′50.832″E / 15.60074000°N 79.81412000°E / 15.60074000; 79.81412000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంచీమకుర్తి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ చరిత్ర

మార్చు

రామతీర్ధంలో, తెలుగు చోళులు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం ప్రాకారాలు నిర్మించేటప్పుడు, బోధిసత్వ అవలోకేశ్వర విగ్రహం బయల్పడినది. దీనినిబట్టి ఇక్కడ సా.శ..రెండవ శతాబ్దం నాటి తొలితరం బౌద్ధ విహరం ఉన్నట్లు గుర్తించారు.

ఈ గ్రామం ఒకప్పుడు జైనులకు నివాసం. ఇకడ వర్ధమాన తీర్ధంకరుల విగ్రహం లఖ్యమైనది. తీర్ధం అంటే స్నానం అని అర్ధం. జైనులు తమలోకి కొత్తవారిని తీసుకొని వారికి పవిత్రస్నానం చేయించి, వారికి జైనశిక్షణ ఆరంభించేవారు. దీనికి కళ్యాణం అని పేరు. జైనుల స్థావరాలలో ఈ విధంగా ప్రతి రోజూ కొత్తవారుచేరుచూ కళాణక్రియ తరువాత జైనులుగా మారేవారు. ఈ సమయంలో తమ ప్రాంగణాలను మామిడాకులతో అలంకరించేవారు. అందుకే తెలుగునాట నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే మాట వచ్చింది.

గ్రామ భౌగోళికం

మార్చు

రామతీర్ధం చీమకుర్తి సమీపంలో ఉంది.

గ్రామ పంచాయతీ

మార్చు

రామతీర్ధం ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ బాలత్రిపురసుందరీ సమేత శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రం రామాయణపు కాలం నాటి క్షేత్రమని ప్రసిద్ధి. ఇక్కడ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని పెద్దలు చెప్తుంటారు. దక్షిణ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి కెక్కినది. రాముడు ప్రతిష్ఠించాడు కావునే ఆపేరు వచ్చింది. అభివృద్ధి  పేరిట ఇక్కడ పురాతన శివ లింగాలు, అనేక శిల్పాలు మట్టిలో కలిసిపోయాయి. స్థానికులు కానీ,పురావస్తు శాఖ కానీ అంతగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక్కడి తిరునాళ్లలో ప్రభల పై ఉన్నంత ఆసక్తి ఆలయాలపై లేకపోవడం విశేషం.,అనాది కాలం నుంచి ఉన్న ఈ శివాలయం ప్రాగణంలో   108 శివలింగాలు ఉన్నట్లు పెద్దలు చెప్పుకుంటారు. నిజానికి ఇక్కడ ప్రాశస్త్యం ఎంత ఉన్న గ్రానైట్స్ తవ్వకాలవలన ఆలయ చరిత్ర, విశిష్టత కుచించుకుపోయాయనే చెప్పాలి. అలా కానీ పక్షంలో ఈ ఆలయం మరో గొప్ప శివాలయంగా పేరొందేది. ఇకనైనా  ప్రభుత్వం దీని పై ద్రుష్టి సారించి అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రకృతి, ఆలయ వైభవంతో గొప్ప పర్యాటక క్షేత్రంగా మారుతోందని చెప్పాలి దక్షిణ కాశీ గా పేరుపొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చి-23,సోమవారం నాడు ప్రాంభించారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

ఈ ఆలయంలో, శ్రీ బాల సుబ్రహ్మణ్యస్వామి చండీశ్వరుడు, నాగశిలల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-11వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో, ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. కళాణమండపం శిఖరప్రతిష్ఠ నిర్వహించారు, స్వామివారి కళ్యాణం నిర్వహించారు.

ఈ ఆలయ ప్రాంగణంలోని విభూతి గుండం గా ప్రసిద్ధి చెందిన కోనేరు అభివృద్ధికి, చీమకుర్తి మండల పరిషత్తు, ఆర్.ఎల్.పురం పంచాయతీ నిదుల నుండి, ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించింది. ఈ పనులు 3 రోజుల క్రితం ప్రారంభమైనవి. ఈ పనులలో భాగంగా కొత్తగా ఇక్కడ మెట్ల నిర్మాణం, భక్తులు బయట స్నానాలు చేసేటందుకు వీలుగా షవర్ల ఏర్పాటు, ప్రహరీ, దుస్తులు మార్చుకునేటందుకు గదుల నిర్మాణం మొదలగు పనులు చేపట్టెదరు. [5]

శ్రీ అనంత కోదండరామస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2015,డిసెంబరు-14వ తేదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు.

శ్రీ గంగమ్మతల్లి ఆలయం

మార్చు

రామతీర్ధంలోని శ్రీ గంగమ్మ తల్లి వార్షిక తిరుణాళ్ళు, ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమినాడు వైభవంగా నిర్వహించెదరు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు