బూచేపల్లి సుబ్బారెడ్డి

బూచేపల్లి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రానైట్‌ పారిశ్రామికవేత్త. శాసనసభ్యుడు. [1]

బూచేపల్లి సుబ్బారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు సానికొమ్ము పిచ్చిరెడ్డి
తరువాత బూచేపల్లి శివప్రసాదరెడ్డి
నియోజకవర్గం దర్శి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2019 మే 11
బంజారా హిల్స్, హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకాయమ్మ
సంతానం ఇద్దరు కుమారులు( కమలాకర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి), కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు

జీవిత విశేషాలు మార్చు

అతని తండ్రి కోటిరెడ్డి. అతను 1968-71 లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందాడు. [2] అతను 2004 ఆంధ్రప్రదేశ్ శాసనభ ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబూరావుపై విజయం సాధించాడు. [3] వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోఅతను కాంగ్రెస్‌ పార్టీకి అసోసియేట్‌ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చాడు. 2009లో అతను రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాడు.

సుబ్బారెడ్డి తో పాటు అతని భార్య వెంకాయమ్మ కూడా ప్రకాశం జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలకు సుపరిచితులైనారు. [4] వారు 2008లో చీమకుర్తిలో బి.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు.[5]

అతను మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2019 మే 12న మరణించాడు.[1][6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sakshi (12 May 2019). "మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి కన్నుమూత". Retrieved 4 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "ఎలక్షన్ అఫిడవిట్లో విద్యార్హతలు". affidavitarchive.eci.nic.in. Retrieved 2022-06-05.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2022-05-20. Retrieved 2022-06-05.
  4. sumadhura (2019-05-12). "Ex-MLA Buchepally Subbareddy no more". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-05.
  5. "BVSR Engineering College, Chimakurthy,Andhra Pradesh". www.bvsr.ac.in. Archived from the original on 2021-11-27. Retrieved 2022-06-05.
  6. HMTV (11 May 2019). "విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి." Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.