రామయ్యా వస్తావయ్యా

2013 సినిమా

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా రామయ్యా వస్తావయ్యా. జూనియర్ ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, శృతి హాసన్ కథానాయికలు. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

రామయ్యా వస్తావయ్యా
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం హరీష్ శంకర్
నిర్మాణం దిల్ రాజు
కథ హరీష్ శంకర్
చిత్రానువాదం రమేష్ రెడ్డి,
వెగ్నేశ సతీష్
తారాగణం జూనియర్ ఎన్.టి.ఆర్.,
సమంత,
శృతి హాసన్
సంగీతం ఎస్.ఎస్. తమన్
సంభాషణలు హరీష్ శంకర్
ఛాయాగ్రహణం ఛోటా కే. నాయుడు
కూర్పు అవినాష్ శైల
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నందు (ఎన్టీయార్ కాలేజీ స్టూడెంట్. స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని జీవితంలోకి ఊహించని విధంగా ఆకర్ష {సమంత} ప్రవేశిస్తుంది. ఆమెను రకరకాలుగా ఆకట్టుకుని, ప్రేమలో పడేస్తాడు. అంతేకాదు. ఆమె బామ్మ (రోహిణీ హట్టంగడీ)కీ దగ్గరైపోతాడు. ఆమె కోరిక మేరకు ఆకర్ష అక్క పెళ్ళికి ఇతనూ అతిథిగా వెళతాడు. బిజినెస్ మేగ్నెట్ అయిన ఆకర్ష తండ్రిని నాగభూషణం (ముఖేష్ రుషి)ని చంపేస్తామంటూ కొందరు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. 'మీరేమీ భయపడకండి అంకుల్, నేనున్నాను' అని హామీ ఇస్తాడు నందు. తనపక్కనే నందుని కూర్చోపెట్టుకుని నిమిషాలు లెక్కిస్తున్న ఆకర్ష తండ్రిని నందూనే అతిక్రూరంగా హతమార్చుతాడు. తన ప్రియురాలి తండ్రిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, అంతటి ఘోరం అతనేం చేశాడు... అసలు నందు ఎవరు!? ఈ ప్రశ్నలకు సమాధానంగా ద్వితీయార్ధం సాగుతుంది.[1]

స్పందనలు

మార్చు
  • మామూలు సాధారణ ప్రతీకార కథ! అదే తరహాలో సాగిన చిత్రానువాదం!! చోటా కె నాయుడు కెమెరా పనితనం బాగానే ఉంది. ఎటొచ్చి కథలో బలం లేకపోవడంతో, స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండటంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది. [1] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వడ్డి ఓంప్రకాశ్ (21 October 2013). "వచ్చిన రామయ్య... నచ్చలేదు !". జాగృతి వారపత్రిక. Retrieved 15 February 2024.