రామ్ తేరీ గంగా మైలీ
రామ్ తేరి గంగా మైలీ (ఆంగ్లం: Ram Teri Ganga Maili) 1985లో విడుదలైన భారతీయ చలనచిత్రం. ఇది హిందీ భాషలో వచ్చిన రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో మందాకిని, రాజీవ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
రామ్ తేరీ గంగా మైలీ | |
---|---|
దర్శకత్వం | రాజ్ కపూర్ |
రచన | రాజ్ కపూర్ వి. పి. సాఠే కె. కె. సింగ్ జ్యోతి స్వరూప్ |
నిర్మాత | రణధీర్ కపూర్ |
తారాగణం | మందాకిని రాజీవ్ కపూర్ |
ఛాయాగ్రహణం | రాధూ కర్మాకర్ |
కూర్పు | రాజ్ కపూర్ |
సంగీతం | రవీంద్ర జైన్ |
పంపిణీదార్లు | ఆర్. కె. ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 16 ఆగస్టు 1985 |
సినిమా నిడివి | 178 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹1.44 కోట్లు |
బాక్సాఫీసు | est. ₹19 crores (equivalent to ₹326 crore (US$46 million) in 2016) |
వివాదం
మార్చురామ్ తేరీ గంగా మైలీ (హిందీ: राम तेरी गंगा मैली)కి తెలుగులో అర్థం 'రామ్, నీ గంగా కళంకితమైంది'. హీరోయిన్ మందాకిని పారదర్శకమైన చీరలో తల్లిపాలు పట్టడం, స్నానం చేయడం వంటి బోల్డ్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రం వివాదాన్ని సృష్టించింది. దీనికి సంప్రదాయవాద భారతీయ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి బోర్డు అనుమతించలేదు. మొదటిలో U (యూనివర్సల్) వయస్సు రేటింగ్‌ను ఇచ్చినా తరువాత U/Aకి సవరించబడింది. కపూర్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇది.
రామ్ తేరీ గంగా మైలీ భారతీయ సినిమా 'ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్స్' జాబితాలో చేర్చబడింది. ఇది ముంబైలో డైమండ్ జూబ్లీ, ఇతర ప్రధాన నగరాల్లో గోల్డెన్ జూబ్లీగా ధృవీకరించబడింది. ఈ చిత్రం సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. క్రాంతి (1981), మైనే ప్యార్ కియా (1989)తో పాటు 1980లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది కూడా ఒకటి.[1]
అవార్డులు
మార్చు33వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
గెలిచినవి:
ఉత్తమ చిత్రం - రణధీర్ కపూర్
ఉత్తమ దర్శకుడు - రాజ్ కపూర్
ఉత్తమ సంగీత దర్శకుడు - రవీంద్ర జైన్
ఉత్తమ కళా దర్శకత్వం - సురేష్ జె. సావంత్
ఉత్తమ ఎడిటింగ్ - రాజ్ కపూర్
నామినేట్ చేయబడినవి:
ఉత్తమ నటి - మందాకిని[2]
ఉత్తమ సహాయ నటుడు - సయీద్ జాఫ్రీ
ఉత్తమ గీత రచయిత - హస్రత్ జైపురి
ఉత్తమ నేపథ్య గాయకుడు - సురేష్ వాడ్కర్
ఉత్తమ కథ - రాజ్ కపూర్
మూలాలు
మార్చు- ↑ "Boxofficeindia.com". 2013-10-14. Archived from the original on 2013-10-14. Retrieved 2020-08-07.
- ↑ "Filmfare Awards" (PDF). p. 71. Archived from the original (PDF) on 12 జూన్ 2009. Retrieved 14 September 2008.