రాయగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం
రాయగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాయగిరి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] యాదాద్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం కాకతీయుల, రెడ్డిరాజుల కాలంలో నిర్మించడంలో చరిత్ర ద్వారా తెలుస్తోంది.[2]
రాయగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
రాయగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం | |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | యాదాద్రి భువనగిరి జిల్లా |
ప్రదేశం: | రాయగిరి, భువనగిరి మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వేంకటేశ్వరస్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | వార్షిక బ్రహ్మోత్సవాలు |
చరిత్ర-నిర్మాణం
మార్చుదేవాలయ మెట్ల వద్ద ఆళ్వార్ల బొమ్మలు చెక్కి ఉండగా ఆ పక్కనే ఆంజనేయుడు, ధ్వజస్తంభాలు, మెట్లబావి, అనంతపద్మనాభస్వామి దేవాలయం మొదలైనవి ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని మల్లన్నగుట్ట మీద రాయగిరి కోట ఉంది. నాలుగు ధ్వజస్తంభాలలో ఒకదానిపై వైష్ణవ మత గురువులు, మరొకదానిపై కూర్మం, సర్పం, ఆంజనేయుడు, ఇంకో స్తంభంపై భూదేవి లక్ష్మీసహిత, విష్ణుమూర్తి, గురుడ శిల్పాలు ఉన్నాయి.[3]
మెట్లబావి
మార్చుగ్రామ సమీపంలోని గుట్టపై అందమైన నిర్మాణంతో చతురస్రాకారంలో, బోర్లించిన పిరిమిడ్‌లా ఉన్న మెట్లబావి (కోనేరు) 16వ శతాబ్ధం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. బావి ప్రారంభంలోవున్న మంటపంలో ఉత్సవాల సమయంలో దేవుతామూర్తుల విగ్రహాలకు చక్రస్నానం చేయిస్తారు.[4]
మెట్లబావి చుట్టూ పార్కు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయబడింది. మెట్లబావి పరిసరాల్లో మొత్తం 17ఎకరాల స్థలం ఉండగా, ఆ స్థలంలో వేద పాఠశాల, శిల్ప కళాశాల, సాంస్కృతిక పాఠశాల, అర్చక శిక్షణ కేంద్రం మొదలైనవి నిర్మించడానికి వైటీడీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.[3]
వార్షిక బ్రహ్మోత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటివారంలో దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు ఉత్సవమూర్తుల విగ్రహాలను రాయగిరి నుంచి ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చి పద్మనాభస్వామి దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరుపుతారు. రెండవరోజు రాత్రి 9:30గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం, మూడవరోజు రాత్రి 9:30గంటలకు దివ్యవిమాన రథోత్సవం, నాలుగోరోజు చక్రతీర్థం, ఐదవరోజు శతఘటాభిషేకం, సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో గ్రామంలోని వేంకటేశ్వర దేవాలయానికి తీసుకురావడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.[5] 2023 ఉత్సవాలకోసం దేవాలయం కిందగల మెట్లబావి (కోనేరు) పునరుద్ధరించబడింది. ప్రాంగణంలో సదుపాయాల కల్పన కోసం మున్సిపాలిటీ 34 లక్షల రూపాయలు కేటాయించింది.[6]
మూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (16 April 2016). "మరపునబడ్డ మనచరిత్ర-రాయగిరి". శ్రీరామోజు హరగోపాల్. Archived from the original on 2016-04-21. Retrieved 2023-02-08.
- ↑ "మెట్ల బావికి పర్యాటక శోభ". EENADU. 2023-01-30. Archived from the original on 2023-02-08. Retrieved 2023-02-08.
- ↑ 3.0 3.1 telugu, NT News (2022-12-26). "రాయగిరి మెట్లబావికి పర్యాటక కళ". www.ntnews.com. Archived from the original on 2022-12-27. Retrieved 2023-02-08.
- ↑ "600 ఏళ్ల మెట్లబావికి మహర్దశ". Sakshi. 2023-01-30. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-08.
- ↑ telugu, NT News (2023-02-04). "నేటి నుంచి రాయగిరి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు". www.ntnews.com. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-08.
- ↑ "నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు". EENADU. 2023-02-04. Archived from the original on 2023-02-08. Retrieved 2023-02-08.