రాయగిరి కోట
రాయగిరి కోట తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాయగిరి గ్రామసమీపాన ఉన్న మల్లన్న గుట్టపై రెండువేల ఏండ్ల క్రితం ఎంతో వైభవాన్ని చవిచూసిన కోట.[1] మాల్యాల కమ్మ ప్రభువులు కాకతీయ కమ్మ ప్రభువుల కాలంలో ఈ కోటని ఆధునీకరించి వారి పతనం తరువాత కొంత కాలం స్వతంత్రంగా పాలించారు.[2]
రాయగిరి కోట | |
---|---|
రాయగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ | |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
స్థల చరిత్ర | |
వాడిన వస్తువులు | రాతి |
కోట చరిత్ర
మార్చురాయగిరి కోట శాతవాహనుల కాలంలోనే నిర్మాణం జరిగి ఉంటుందని, అనంతరకాలంలో విష్ణు కుండినులు కొంతకాలం ఈ కోట కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించి ఉంటారని, వారి తర్వాత రాష్ట్రకూట రాజులు ఈ కోటను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని ఏలి ఉంటారని చరిత్రకారుల అంచనా.
కోట విశేషాలు
మార్చుమల్లన్నగుట్ట తూర్పు దిశ మధ్యలోనే చిన్నచిన్న రాళ్ళతో నిర్మించిన మూడు ప్రాకారాల కోటగోడ (2 అడుగుల వెడల్పుతో 18 అడుగుల ఎత్తులో రాతి గోడలు) ఉంటుంది. ఒకటి మట్టిగోడ, రెండవది చెక్కిన పెద్ద రాతిబండలతో రెండవ వరుస కోటగోడకాగా మూడవది చక్కగా గోడలకోసం చెక్కిన రాతిబిళ్ళలతో కట్టిన గోడ. సరిగ్గా కోట మధ్యలో మల్లన్నగుడి ఉంటుంది. మల్లన్నగుడి రాతిద్వారం రెండు శేరలమీద కలశాలు (జైనబసది లేదా గుడికి వుండే గుర్తులు) ఉన్నాయి. దీనినిబట్టి మొదట జైనదేవాలయంగా వున్న ఈ గుడి తర్వాత శివాలయంగా మార్చబడిందని తెలుస్తుంది. గుడి ముందు వినాయకుడు, తలలేని నంది, ఆంజనేయుడు ఉన్నారు. గుడికి దగ్గరలో రెండు సహజసిద్ధమైన నీటికుండాలున్నాయి. 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కోటను పూర్తిగా తిరిగి చూడాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. 8 కి.మీ. పొడవు, 5 కి.మీ.ల వెడల్పుండే గుట్టపై 40 కి.మీ.ల వైశాల్యంతో మైదానప్రాంతం ఉంటుంది. నాలుగు కొలనులు, ఎన్నో నివాస గృహాల ఆనవాళ్ళు, పెద్ద పరిమాణంలో ఉన్న ప్రాచీన ఇటుకలు ఉన్నాయి. స్తూపనిర్మాణం వుండవచ్చనిపించే ఇటుకలతో కట్టిన తొట్లు, ఇతర నిర్మాణాలు అక్కడక్కడ కనిపిస్తాయి. భువనగిరి కోట కన్నా ముందే ఈ కోట నిర్మాణం జరిగివుండవచ్చు. ఇక్కడి కోట నిర్మాణం, భవనాల కట్టుకం, కుండాల నిర్వహణ, దేవాలయాలు, స్తూపాలవంటి నిర్మాణాలు... ఇవన్నీ ఈ రాయగిరి కోట విష్ణుకుండినుల కాలం, అంతకన్నా ముందే ఇక్కడ కట్టివుంటారని భావించవచ్చు.[3]
కోటలోని చిన్నచిన్న రాళ్ల గుట్టలో (రాళ్ల చెరికలో) స్వయంభూగా వెలిసిన లక్ష్మీనారసింహస్వామిని ఇప్పటికి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజ భవనాల తాలూకు పునాదులు, సైనికులు, మంత్రులు, ఇతర రాజ పరివారపు నివాస కట్టడాల తాలూకు ఆనవాళ్లు మనకు కోటలోపల అక్కడక్కడా కనిపిస్తాయి. కొన్ని రాతిశిల్పాలపై గజిబిజిగా చెక్కబడిన కొన్ని అక్షరాలు ఉన్నాయి.[1]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ మాగజైన్ (1 August 2017). "ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి". నాగబాల సురేష్ కుమార్. Retrieved 26 October 2017.
- ↑ History of Kammas by K. B. Choudary
- ↑ నవతెలంగాణ (16 April 2016). "మరపునబడ్డ మనచరిత్ర-రాయగిరి". శ్రీరామోజు హరగోపాల్. Archived from the original on 21 ఏప్రిల్ 2016. Retrieved 26 October 2017.