రాయదుర్గం కోట ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఉంది.[2]

రాయదుర్గం కోట
అనంతపురం జిల్లా రాయదుర్గం లో భాగం
అనంతపురం జిల్లా, రాగదుర్గం
రాయదుర్గం కోట is located in Andhra Pradesh
రాయదుర్గం కోట
రాయదుర్గం కోట
భౌగోళిక స్థితి14°42′00″N 76°52′00″E / 14.7°N 76.8667°E / 14.7; 76.8667[1]
రకముకోట
స్థల సమాచారం
నియంత్రణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంమధ్యయుగం
కట్టించిందిజుంగా నాయకా

ఉనికి మార్చు

ఇది రాయదుర్గం బస్టాండు నుండి 2 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 99 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి నుండి 53 కిమీ గుంతకల్ నుండి 95 కిలోమీటర్ల దూరంలో కర్నూలు నుండి 245 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి 449 కిమీ దూరములో ఉంది.

చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన కోటలలో ఇది ఒకటి. ఇది మద్య యుగములో నిర్మించిన కోట. ఇది 2727 అడుగుల ఎత్తు ఉంది. చారిత్రిక ఆధారల ప్రకారం ప్రకారం, రాయదుర్గం కోట జుంగా నాయకా, విజయనగర రాజుల యొక్క ఒక సేనాపతి నిర్మించారు. ఈ కోట తళ్లి కోట యుద్ధానంతరము వెంకటపతి నాయకుడు ద్వారా చాల వరకు పతిష్టం చేయ బడింది. టిప్పు సుల్తాన్ పాలనలో దీనిని గుత్తి సంస్థానంలో విలీనం చేశారు. .

రాయదుర్గం కోట విజయనగర రాజుల కాలంలో చాల కీలక పాత్ర పోషించింది. ఇది రాయదుర్గం పట్టణంలో ఒక కీలకమైన పర్యాటక ప్రాంతము. ఇక్కడ ఒక దశభుజ గణపతి విగ్రహమున్నది. ఇది ఏక శిలా విగ్రహము. ఇది కాక ఇక్కడ, ఎల్లమ్మ, ప్రసన్న వేంకటేశ్వర ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, జంబుకేశ్వర ఆలయము వీరభద్ర ఆలయము కన్యకా పరమేశ్వారాలయము మున్నగు ఆలయాలున్నవి.

మూలాలు మార్చు

  1. http://wikimapia.org/#lang=en&lat=14.703497&lon=76.855717&z=13&m=b&search=rayadurgam%20andhra%20pradesh
  2. "రాయదుర్గం కోట". discoveredindia.com. Retrieved 15 October 2016.

ఇతర లింకులు మార్చు