రాయవాడ రిజర్వాయర్

అనకాపల్లి జిల్లాలో ఉన్న జలాశయం

శ్రీ వారాడ నారాయణ మూర్తి రైవాడ జలాశయం (రైవాడ రిజర్వాయర్) విశాఖపట్నం నగరానికి 58 కి.మీ దూరంలో దేవరాపల్లి మండలం, రైవాడ గ్రామం దగ్గర ఉన్న ఒక జలాశయం. ఇది విశాఖపట్నం నగరానికి ప్రధాన నీటి వనరులలో ఒకటి. దీని సామర్థ్యం 2,360 టీఎంసీలు,జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు.[1] దీనిని ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తుంది.[2][3]

రైవాడ జలాశయం
అధికార నామంశ్రీ వరాడ నారాయణ మూర్తి రైవాడ రిజర్వాయర్ ప్రాజెక్ట్
దేశంభారత దేశం
ప్రదేశందేవరాపల్లి,అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
అక్షాంశ,రేఖాంశాలు18°01′09″N 82°58′59″E / 18.019092°N 82.983007°E / 18.019092; 82.983007
ప్రారంభ తేదీ1982
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుశారదా నది
పొడవు5,750 m

చరిత్ర

మార్చు

రైవాడ జలాశయం గురించి 1962 శాసనసభ చర్చలలో అంచనా వ్యయం ₹1.1 కోట్లుగా (2024లో ₹96 కోట్లకు సమానం) ప్రస్తావించారు.[4] మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్తో కలిపి, త్వరలో ఏర్పాటు కానున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు అప్పటికే ఉన్న హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం కు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా అని 1964లో చర్చించారు.[5] రైవాడ రిజర్వాయర్ పథకం మూడవ భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో చేర్చబడింది,[6] మరియు ప్రాజెక్ట్ 1981లో నిర్మించబడింది. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ జర్నల్‌లో "వాటర్ ఫర్ ది రిచ్" అనే 1997 కథనంలో పరిశ్రమలకు 125 లక్షల గ్యాలన్‌లను సరఫరా చేసి పరిశ్రమల నీటి సరఫరాకు GVMC ప్రాధాన్యతనిచ్చి, గృహ వినియోగానికి రోజుకు 97 లక్షల గ్యాలన్లు మాత్రమే అందించిందని ఆరోపించారు.[7]

కాలువలు

మార్చు

56 కిలోమీటర్లు పొడవున్న తాగు నీటి కాలువ దేవరాపల్లె, వేపాడ, కె. కోటపాడు, సబ్బవరం మీదుగా వెళ్లి, విశాఖ నగరం తాగునీటి అవసరాల కోసం నరవ దగ్గర ఫిల్ట్రేషన్ ప్లాంట్‌కు నీటిని రవాణా చేస్తుంది[8]. కాలువల మొత్తం పొడవు 68 కి.మీ. వేసవిలో నీటి కొరత కారణంగా డెడ్ స్టోరేజీ నుండి నీటిని తీసుకోవడానికి 2019లో GVMC ₹1.96 కోట్లు ఖర్చు చేసింది.[9]

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. ABN (11 సెప్టెంబరు 2022). "రైవాడ జలాశయం నుంచి నీరు విడుదల". Andhrajyothy Telugu News. Retrieved 25 ఆగస్టు 2024.
  2. "Raiwada Reservoir Project". Archived from the original on 14 మే 2023. Retrieved 5 డిసెంబరు 2023.
  3. "Raiwada Dam D02223 -". Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 18 నవంబరు 2017.
  4. Andra Pradesh Legislative Assembly Debates: 15-12-1962.
  5. Andra Pradesh Legislative Assembly Debates: 21-02-1964.
  6. Pradesh, India (Republic) Superintendent of Census Operations, Andhra (1967). District Census Handbook, Andhra Pradesh, Census 1961: Visakhapatnam (in ఇంగ్లీష్). Government of Andhra Pradesh.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  7. 8233 Economic Polotical Weekly Volno-32(1997).
  8. Bharat, E. T. V. (28 సెప్టెంబరు 2020). "రైవాడ జలాశయం నుంచి గ్రేటర్ విశాఖకు తాగునీరు విడుదల". ETV Bharat News. Retrieved 25 ఆగస్టు 2024.
  9. Sarma, G. V. Prasada (6 మే 2019). "All set for pumping from dead storage of Raiwada reservoir". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 25 ఆగస్టు 2024.