రాయ వాచకం విశ్వనాథ నాయనయ్యరు గారి స్థానాపతి రచించిన చారిత్రిక గ్రంథం. శ్రీకృష్ణదేవరాయలు గురించి తెలియజేసేది కాబట్టి దీనికి రాయవాచకమని పేరు. స్థానాపతి అంటే సామంత రాజులు తమ ప్రతినిథిగా విజయనగర సామ్రాజ్యంలో నియమించుకున్న ఉద్యోగి. ఈ పుస్తకం పీఠికలో చెప్పినట్లుగా స్థానాపతి రాయల పట్టాభిషేకం, మంత్రులు రాజనీతిని ఉపదేశించడం, పొద్దున్నే రాజు దినచర్య, రాత్రి పట్టణ విహారం, అధికారులతో రాజు పనులు ఎలా చేయించుకునేవారు, గజపతుల మీద దండయాత్ర, తిరుమలలో మొక్కులు తీర్చుకోవడం లాంటి విషయాలు వివరించబడ్డాయి.

రాయ వాచకం
కృతికర్త: విశ్వనాథ నాయనయ్య స్థానాపతి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర రచన
ప్రచురణ:
విడుదల:

రచనా కాలం, నేపథ్యం మార్చు

రాయవాచకాన్ని కాశీ విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి రచించినట్టు చెప్తారే తప్ప రచయిత పేరు ఉండదు. స్థానాపతి అన్నది రచయిత ఉద్యోగ పదవి, విశ్వనాథ నాయనయ్య వృత్తాంతాల్లో సుప్రసిద్ధుడైన మధుర నాయక రాజు విశ్వనాథ నాయకుడు అని భావిస్తారు. విశ్వనాథ నాయకుడి పాలనా కాలం కూడా అస్పష్టంగా ఉండడంతో ఈ రాయవాచకం రచనా కాలమూ అస్పష్టమే. కృష్ణరాయలు మరణించిన శతాబ్ది తర్వాత ఈ పుస్తకాన్ని విజయనగర సామంతుల నుంచి స్వతంత్ర పాలకులైన వారికి ప్రజల మద్దతు కోసం, తమను రాయల వారసులుగా స్థిరపరిచేందుకు గాను రాయవాచకాన్ని రచింపజేయడాన్ని భావించారు.[1]

విషయం మార్చు

రాయవాచకం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో ప్రముఖుడు, ప్రఖ్యాతుడు అయిన శ్రీకృష్ణ దేవరాయల దినచర్య, రాజ్యపాలన విశేషాలు, చాతుర్యం వంటి విషయాలను వివరించింది. రాయవాచకం స్థానాపతి తన పాలకుడు విశ్వనాథ నాయనయ్యకు సమర్పించిన నివేదిక తరహాలో సాగుతుంది, కృష్ణరాయల పట్టాభిషేకంతో ప్రారంభమై కళింగరాజు గజపతిపై విజయంతో ముగుస్తుంది.[2] రాయల వారి స్నానపానాలు, ఆహార విహారాలు, పాలనా విధానాలు మొదలైనవన్నీ పుస్తకంలో ప్రస్తావించారు.[3]

మూలాలు మార్చు

  1. మోదుగుల, రవికృష్ణ. మనవి మాటలు. గుంటూరు.
  2. సిరాశ్రీ. "పుస్తక సమీక్ష:రాయవాచకం". గోతెలుగు. Retrieved 24 April 2016.
  3. జి.వి., పూర్ణచంద్. "భోజన మర్యాదలు". డా.జి.వి.పూర్ణచంద్. Retrieved 24 April 2016.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=రాయ_వాచకం&oldid=3888764" నుండి వెలికితీశారు