రావికంటి వసునందన్
రావికంటి వసునందన్ బహుగ్రంథకర్త. పలు సత్కారాలను పొందినవాడు.
రావికంటి వసునందన్ | |
---|---|
జననం | రావికంటి వసునందన్ 1949, మే 4 కమాన్‌పూర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
వృత్తి | అధ్యాపకుడు |
ప్రసిద్ధి | కవి, రచయిత, ప్రొఫెసర్ |
మతం | హిందూ |
తండ్రి | కిష్టయ్య |
తల్లి | జగ్గమ్మ |
జీవిత విశేషాలు
మార్చుఇతడు మే 4వ తేదీ 1949లో కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ గ్రామంలో కిష్టయ్య, జగ్గమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. భూమిక - ఒక సమగ్ర పరిశీలనం అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్ పట్టాను, ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాను సాధించాడు. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయములో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందాడు. ఇతని రచనలు కొన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమయ్యాయి.
రచనలు
మార్చుకథాకావ్యాలు
మార్చు- రతీప్రద్యుమ్నము
- గురుకులము
- భారతం (నిర్వచన పద్యకృతి)
- బలి
- అష్టాక్షరి
- పంచాక్షరి
- కృష్ణం కలయ...
- ఊర్మిళ
దీర్ఘకావ్యాలు
మార్చు- త్రయి
- మనస్సు
- పిల్లలమఱ్ఱి
- మట్టిముద్దలు
- ఆయుధం కవిత్వం
- ప్రవాహిని
- బాలబ్రహ్మం
- భక్తి
- భావగతం
- సీతమ్మ
- మనతెలంగాణ తల్లి
- చంపుడుగుళ్ళు
- శ్రీచరణశరణాగతి
గేయకావ్యాలు
మార్చు- వేణీసంగమం
- శ్రీ వేంకటేశ్వర తారావళి
- ఎందరో మహానుభావులు
- భగవద్రామానుజులు
- సూరి గుణగానం
విమర్శ, పరిశోధన గ్రంథాలు
మార్చు- భావదీపికలు (సాహిత్యవ్యాసాలు)
- భూమిక - ఒక సమగ్ర పరిశీలనం (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం)
- అష్టాక్షరి - (సినారె రచనలపై విమర్శా వ్యాసాలు)
- ఆధునికాంధ్ర సాహిత్యంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత (పి.హెచ్.డి సిద్ధాంతగ్రంథం)
- తెలుగు సంప్రదాయ కవిత్వం -సామాజిక నేపథ్యం
- వ్యాసభూమిక
వచన కవితాసంపుటాలు
మార్చు- సాధన
- కలం కదిలితే
- మెరుపు మెరిస్తే
- వాన కురిస్తే
- నేల నవ్వితే
- మనసు నిండితే
- సింగిణీ మొలిస్తే
- నెమలి ఆడితే
- గుండె పొంగితే
- అరవై పండితే
- ఆత్మ పలికితే
- లోవెలుగులు (ముక్తకాలు)
- శతమానంభవతి
- రావికన్నులు
- అనుయోగం (త్రిపదులు)
- అడుగడుగునా
బాలసాహిత్యం
మార్చు- బాలజ్యోతులు
- భారత నారీమణులు
ఆడియో క్యాసెట్లు
మార్చు- శ్రీరామ చరితామృతమ్
- జై గణేష్
- బాలాజీ
ఇతర రచనలు
మార్చు- ప్రజావిజయం[1] (రేడియో నాటకం)
- ప్రయోజన దండకాలు
- భక్త శిఖామణులు
- శ్రీ వేదవ్యాస విజయం
- వంద కందాలు
- వ్యాసప్రభాస (సంపాదకత్వం)
- నిరంతర సాహితీమూర్తి సినారె (సహ సంపాదకత్వం)
- అభినవ పోతన (ప్రధాన సంపాదకత్వం)
- యశస్వి (ప్రధాన సంపాదకత్వం)
పురస్కారాలు
మార్చు- ఎ.పి.ఎ.యు.ఎస్. సమాఖ్య కడప వారిచే స్వర్ణపతకం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక అవార్డు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ధర్మనిధి సాహిత్య పురస్కారం
- దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం
- జమిలి నమ్మాళ్వార్ స్మారక పురస్కారం
- వానమామలై వరదాచార్య సాహిత్య పురస్కారం
- దోమా వేంకటస్వామిగుప్త సాహిత్య పురస్కారం
- కౌముది ప్రతిభా పురస్కారం
- సాహితీమేఖల పురస్కారం
- అందె వేంకటరాజము స్మారకపురస్కారం
- సనాతన ధర్మ ట్రస్ట్ వారి శ్రీరామనవమి పురస్కారం
- యువభారతి వారి ఇరివెంటి కృష్ణమూర్తి సాహితీ పురస్కారం మొదలైనవి.
- 2016 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013, 13 జూలై 2016, (శ్రీ చరణ శరణాగతి పుస్తకానికి)[2][3]
బిరుదులు
మార్చుఇతడిని భారతీ సాహిత్య సమితి కోరుట్ల కవిశిరోమణి బిరుదుతో సత్కరించింది.
మూలాలు
మార్చు- ↑ రావికంటి, వసునందన్ (1990). ప్రజావిజయం. హైదరాబాద్: జగ్గమాంబ ప్రచురణలు. Retrieved 5 February 2015.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
- ↑ ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.