రావిపల్లి నారాయణరావు

తెలుగు రచయిత

రావిపల్లి నారాయణరావు తెలుగు కథా రచయిత. ఈయన 1932 సంవత్సరంలో ఆగష్టు 31విజయనగరం జిల్లా రావిపల్లి గ్రామంలో జన్మించాడు. వృత్తిరీత్యా దక్షిణ మధ్య రైల్వేలో ఆఫీస్ సూపరింటెండ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయన గమనించిన రైల్వే కూలీల, కార్మికుల కష్టసుఖాలకు స్పందించి కథల రూపంలో రచించాడు.

రావిపల్లి నారాయణరావు
రావిపల్లి నారాయణరావు
జననంరావిపల్లి నారాయణరావు
1932 ఆగష్టు 31
విజయనగరం జిల్లా రావిపల్లి
ఇతర పేర్లురావిపల్లి నారాయణరావు

ఈయన సుమారు 80 కథలు వ్రాశాడు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికి అందించాడు.

ఈయన కథలలో 'జీవితం ఒక నాటకం', 'కాకతాళీయం', 'స్వయంకృతం', 'కన్నీళ్ళు', 'గురుదక్షిణ', 'సమయోచితం', 'ఆశయానికి సంకెళ్ళు', 'ప్రతిఫలం', 'మారే కాలంలో మారని కథ', 'నన్ను భార్యగా స్వీకరిస్తారా!', 'హంతకుని పరిశోధన' పాఠకులకు ప్రియమైనవి.

1974లో ఆంధ్రపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన రక్తాక్షి ఉగాది సస్పెన్స్ కథల పోటీలో 'అరకు లోయకత' కథకు కన్సొలేషన్ బహుమతి లభించింది.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో పిల్లల కార్యక్రమంలో అనేక నాటికలు ప్రసారం చేశారు.

మూలాలు మార్చు

  • కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.