రావుగారింట్లో రౌడీ

(రావుగారింట్లో రౌడి నుండి దారిమార్పు చెందింది)

రావుగారింట్లో రౌడీ 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, సుమన్, రజని నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. [1] [2]దీనిని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ [3]లో ఎన్. సాయి ప్రసన్న నిర్మించాడు. [4]

రావుగారింట్లో రౌడీ
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎన్. సాయి ప్రసన్న
కథ రామ్ ప్రసాద్ ఆర్ట్స్
చిత్రానువాదం కోడి రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
వాణిశ్రీ,
సుమన్,
రజని
సంగీతం రాజ్ - కోటి
ఛాయాగ్రహణం శరత్
కూర్పు కె నాగేశ్వరరావు
సత్యనారాయణ
నిర్మాణ సంస్థ రామ్ ప్రసాద్ ఆర్ట్స్
భాష తెలుగు

కథసవరించు

కోటిగాడు (సుమన్) అనే రౌడీ ఒక కాలనీలో నివసిస్తూంటాడు. అక్కడ అతన్ని ప్రేమిస్తున్న అందమైన అమ్మాయి గౌరి (రజని) తప్ప అందరూ అతనిని చూసి భయపడతారు. అలెగ్జాండ్రా (రాజా కృష్ణ మూర్తి), బుజ్జులు (కోట శ్రీనివాసరావు) & పెరియప్ప దేవర (సుదర్శన్) అనే ముగ్గురూ అతన్ని తమ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయుధంగా వాడుకుంటూంటారు. ఆ సమయంలో, ఒక ఆదర్శ జంట ఆనందరావు (అక్కినేని నాగేశ్వరరావు) & వాణి (వాణిశ్రీ) కాలనీలోకి అడుగుపెడతారు. వారు కోటిని సంస్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో, కోటి ఈ ముగ్గురితో ఘర్షణ పడతాడు. దాంతో వారు అతనిని నేరంలో ఇరికించి శిక్ష పడేలా చేస్తారు. కానీ అదృష్టవశాత్తూ, ఒక రాత్రి, అతను విడుదలై, ఒక బంగ్లాకు వెళతాడు. అక్కడ ఆశ్చర్యకరంగా ఆనంద రావు & వాణిలను కలుస్తాడు. ఇప్పుడు కోటి, తన శత్రువులను నిర్మూలించే అవకాశ మిమ్మని ఆనందరావును అడుగుతాడు, అప్పుడు ఆనందరావు తమతో 10 రోజుల పాటు ఎటువంటి షరతులూ లేకుండా ఉండమని కోటిని అడుగుతాడు, అతడందుకు అంగీకరిస్తాడు. ఇక్కడ, ఆనందరావు మనవరాలు బేబీ (బేబీ సౌమ్య హంసా) పరిచయంతో కోటి నెమ్మదిగా మారతాడు. 10 రోజుల తరువాత, కోటి బేబీపై తెలియని ఆప్యాయతను పెంచుకుంటాడు. ఆమెను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితికి వెళ్తాడు. బేబీ తన అమ్మానాన్నలను తెచ్చివ్వమని అతణ్ణి దుఃఖంతో వేడుకుంటుంది. కోటి బేబీ తల్లిదండ్రుల గురించి ఆనందరావును అడుగుతాడు. అప్పుడు కోటి బేబీ తల్లిదండ్రుల ఫోటోను చూడడం తోనే వారి కష్టాల వెనుక ఉన్న వ్యక్తి తానేనని అతనికి తెలుసుకుంటాడు.

వాస్తవానికి, ఆనంద రావు పబ్లిక్ ప్రాసిక్యూటరు. అతడిపై పగను తీర్చుకోవడానికి వారు ఆనంద్ రావు అల్లుడిని కోటి ద్వారా కిడ్నాప్ చేయిస్తారు. ఆ గొడవలో, అతని కుమార్తె జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఇప్పుడు కోటి అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ పిల్లలను విడుదల చేయడానికి ఆ ముగ్గురూ అతడితో ఆడుకుంటారు. దురదృష్టవశాత్తు, ఆనంద రావు కుమార్తె వారి వాహనం కింద పడి తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతుంది. కోటి ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో, ఆ పిల్లలు తప్పించుకుంటారు. కోటి ఆనంద రావు అల్లుడిని రక్షిస్తాడు, దుష్టులను శిక్షించి పోలీసులకు లొంగిపోతాడు. చివరికి, కోటి స్వల్పకాలిక శిక్షతో విడుదలవుతాడు. చివరగా, కోటి, గౌరీల వివాహంతో ఈ చిత్రం సంతోషకరంగా ముగుస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కళ: రామ్ చంద్ర సింగ్
 • నృత్యాలు: శివ సుబ్రమణ్యం, శివ శంకర్
 • స్టిల్స్: వెంకట్
 • పోరాటాలు: విక్రమ్ ధర్మం
 • సంభాషణలు: టి. మధు
 • సాహిత్యం: జోన్నావితుల రామలింగేశ్వరరావు
 • నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి
 • కథ: రామ్ ప్రసాద్ ఆర్ట్స్ యూనిట్
 • సంగీతం: రాజ్-కోటి
 • కూర్పు: కె.నాగేశ్వరరావు, సత్యనారాయణ
 • ఛాయాగ్రహణం: శరత్
 • నిర్మాత: ఎన్. సాయి ప్రసన్న
 • చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
 • బ్యానర్: రామ్ ప్రసాద్ ఆర్ట్స్
 • విడుదల తేదీ: 1990

పాటలుసవరించు

జోన్నవితుల రామలింగేశ్వరరావు సాహిత్యానికి రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. కావేరీ ఆడియో కంపెనీ ద్వారా ఈ సంగీతం విడుదలైంది.

సం పాట గాయనీ గాయకులు నిడివి
1 "మనసనేది మాయా బజార్" ఎస్పీ బాలు 3:39
2 "చిట్టి కన్నా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:17
3 "ఎర్రెత్తి పోయే" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:36
4 "అర్ధ రాత్రి కోడి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:33
5 "మనసనేది మాయా బజార్" ఎస్పీ బాలు 3:15

మూలాలుసవరించు