రాహి సర్నొబట్
రహి జీవన్ సర్నోబట్ (జననం 1990 అక్టోబర్ 30) 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో భారత దేశం తరపున పోటీ పడుతున్న క్రీడాకారిణి. 2013, 2019 సంవత్సరాలలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆమె రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో సాధించిన విజయంతో ఆమె 2021లో టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. [1]
వ్యక్తిగత జీవితం, నేపథ్యం
మార్చురాహి 1990 అక్టోబర్ 30న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించింది. ఆమె చదువుకునే రోజుల్లోనే ఎన్‌సిసి (నేషనల్ కాడెట్ క్రాప్స్ ) శిక్షణలో భాగంగా తుపాకుల గురించి తెలుసుకుంది. షూటింగ్‌లో ఆమె చిన్నతనం నుంచే సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని కల్గి ఉండేది. [2]
తన పాఠశాలలోనే చదువుతున్న యశశ్వని సావంత్, 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్ వెల్త్ పోటీల్లో స్వర్ణం సాధించడం ఈమెలో మరింత ప్రేరణ కల్గించింది. మొదటి సారిగా తుపాకిని చేత బట్టినప్పుడు ఉద్విక్తకు ఇదే తన జీవిత పరమార్థం అదే అని అనిపించిందట.[2]
షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లో తన సొంత ఊరైన కొల్హాపూర్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఉన్నవాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఆమె కుటుంబసభ్యులు రాహి కు అన్ని విధాల అండగా నిలిచారు. ఆ తర్వాత మెరుగైన శిక్షణ సౌకర్యాలున్న ముంబై కి వెళ్లాలని నిర్ణయించుకుంది. [2]
వృత్తిపరమైన విజయాలు
మార్చు2008లో పూణేలో జరిగిన యూత్ కామన్వెల్త్ క్రీడలలో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించడం రాహి క్రీడా ప్రయాణంలో కీలక మలుపని చెప్పవచ్చు.[2]
2011లో ఫోర్ట్ బెన్నింగ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో ఆమె కాంస్య పతకం సాధించడం ఆమె క్రీడా జీవితం లో మరో కీలకమైన ఘట్టం. [3] ఆ తర్వాత ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 19 వ స్థానంలో నిలిచింది. అయితే ఆమె ఏ మాత్రం నిరాశ పడకుండా కష్టపడి సాధన చేసింది.[2]ఆమె ప్రయత్నాలు ఫలించాయి. 2013లో దక్షిణ కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఆమె బంగారు పతకం సాధించింది. [4]
2015లో జరిగిన ప్రమాదం ఆమె కెరియర్‌ను నిజంగానే ప్రమాదంలో పడేసింది. మోచేయికి తగిన గాయం నయమయ్యేందుకు సుమారు రెండేళ్లు పట్టింది. [4] ఆ తరువాత ఆమె తిరిగి భారత జాతీయ జట్టులో చేరింది. జర్మనీకి చెందిన కోచ్ ముంఖ్ బాయర్ డోర్జ్‌సురెన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది, సర్నోబట్ శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవడంలో ఆమె పాత్ర మరువ లేనిది. [4] 2012 ఒలింపిక్స్‌లో రాహి పై పోటీ చేసిన క్రీడాకారిణుల్లో డోర్జ్ సురెన్ కూడా ఒకతి. [5]
ఆ తరువాత, 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో రాహి స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఆసియా క్రీడల లో షూటింగ్‌లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. 2018 లో షూటింగ్‌లో సాధించిన విజయాలకు ఆమెకు అర్జున అవార్డు లభించింది.[6]
2019, జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించి ఆమె రెండవ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈ విజయం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది. ఒలంపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించాలన్నదే ఆమె ప్రస్తుత లక్ష్యం. [2]
మూలాలు
మార్చు- ↑ "ISSF World Cup: Rahi Sarnobat's journey takes her to Tokyo Games". The Indian Express (in ఇంగ్లీష్). 2019-05-28. Retrieved 2021-02-17.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "ISWOTY రాహి సర్నోబత్: షూటింగ్ నుంచి వైదొలగాలని భావించిన ఆమెకు అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం వచ్చింది". BBC News తెలుగు. Retrieved 2021-02-17.
- ↑ "ISSF World Cup: Rahi Sarnobat's journey takes her to Tokyo Games". The Indian Express (in ఇంగ్లీష్). 2019-05-28. Retrieved 2021-02-17.
- ↑ 4.0 4.1 4.2 "Rahi SARNOBAT". Olympic Channel. Retrieved 2021-02-17.
- ↑ "This shooting star Rahi Sarnobat has an Olympic dream". DNA India (in ఇంగ్లీష్). 2019-09-21. Retrieved 2021-02-17.
- ↑ World, Republic. ""Never ever dreamt of this award"; Rahi Sarnobat silences her critics with an Arjuna". Republic World (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.