కోల్‌కతా నైట్‌రైడర్స్

(Kolkata Knight Riders నుండి దారిమార్పు చెందింది)

కోల్‌కత నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో కోల్‌కతకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టు యాజమాన్యంలో ఒకడు. నటి జుహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా కూడా సహ భాగస్వాములుగా ఉన్నారు. కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్స్ ఈ జట్టుకు స్వంత మైదానం. ఈ జట్టు 2012 లో జరిగిన పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు. అలాగే 2014 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఓడించి విజేతలుగా నిలిచారు. ‍ఈ జట్టుకు దినేష్ కార్తిక్ నాయకత్వం వహిస్తుండగా జాక్ కలీస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

కోల్‌కత నైట్ రైడర్స్
దస్త్రం:Kolkata Knight Riders Logo.svg
లీగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్శ్రేయస్ అయ్యర్ 🏏
కోచ్చంద్రకాంత్ పండిత్
యజమానిరెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (55%)
మెహతా గుప్తా(45%)[1]
జట్టు సమాచారం
నగరంకోల్‌కత, పశ్చిమ బెంగాల్
రంగులుKKR
స్థాపితం2008
స్వంత మైదానంఈడెన్ గార్డెన్స్
సామర్థ్యం68,000[2]
చరిత్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు2 (2012, 2014)
అధికార వెబ్ సైట్kkr.in

T20I kit

Kolkata Knight Riders in 2020

ఈ గ్రూపుకు బాలీవుడ్ సెలెబ్రెటీలు యజమానులుగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ జట్టు మీద ఆసక్తి నెలకొంది. 2011 లో మొదటి సారిగా ప్లే ఆఫ్స్ కు ఎంపికైంది. 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి విజేతగా నిలిచింది. 2014 లో కింగ్స్ XI పంజాబ్ ను ఫైనల్లో ఓడించి మరోసారి విజేతగా నిలిచింది.[3] ట్వెంటీ ట్వెంటీ ఆటల్లో అత్యధిక వరుస విజయాలు (14) సాధించిన జట్టుగా కోల్‌కత నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది.[4]

ఈ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు గౌతం గంభీర్.[5] అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ సునీల్ నరైన్.[6] 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న మనోజ్‌ తివారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.

చరిత్ర

మార్చు

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[7] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో కోల్ కత కూడా ఒకటి.

మూలాలు

మార్చు
  1. "IPL 2019: Meet the owners of the 8 teams taking the field in season 12". Moneycontrol. Retrieved 15 August 2019.
  2. "Eden Gardens". www.iplt20.com. Retrieved 14 September 2018.
  3. "Kolkata Knight Riders win IPL 5, beat Chennai Super Kings". Archived from the original on 2 జూన్ 2012. Retrieved 13 October 2012.
  4. "Records / Twenty20 matches / Team records / Most consecutive wins". ESPNcricinfo. Retrieved 2 October 2014.
  5. "Kolkata Knight Riders / Records / Twenty20 matches / Most runs". Stats. cricinfo.com. Retrieved 30 May 2012.
  6. "Kolkata Knight Riders / Records / Twenty20 matches / Most wickets". Retrieved 30 May 2012.
  7. "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.

బయటి లింకులు

మార్చు