రిత్విక్ ఘటక్

బెంగాలీ చిత్రనిర్మాత మరియు రచయిత

రిత్విక్ కుమార్ ఘటక్ (ఆంగ్లం: Ritwik Kumar Ghatak; 1925 నవంబరు 4 - 1976 ఫిబ్రవరి 6) ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. అలాగే నాటక రచయిత. బెంగాలీ ప్రముఖ చిత్రనిర్మాతలు సత్యజిత్ రే, తపన్ సిన్హా, మృణాల్ సేన్‌లకు ఆయన సమకాలీకుడు. వీరందరి సినిమాలకు ప్రధానంగా సామాజిక వాస్తవికత, స్త్రీవాదం వంటి అంశాలే ఇతివృత్తాలు.

రిత్విక్ ఘటక్
జననం
రిత్విక్ కుమార్ ఘటక్

(1925-11-04)1925 నవంబరు 4
మరణం1976 ఫిబ్రవరి 6(1976-02-06) (వయసు 50)
విద్యబల్లిగంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్‌షాహి కాలేజియేట్ స్కూల్
విద్యాసంస్థప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి
  • దర్శకుడు
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1952–1976
Works
జీవిత భాగస్వామిసురామ ఘటక్
పిల్లలు3[1]
బంధువులుఅరోమా దత్తా (మేనకోడలు)
మనీష్ ఘటక్ (సోదరుడు)
మహాశ్వేతా దేవి (మేనకోడలు)
పరంబ్రత ఛటర్జీ (మనవడు)
నబరున్ భట్టాచార్య (సోదరుని మనవడు)
బిజోన్ భట్టాచార్య (మేనల్లుడి భార్య)
పురస్కారాలుపద్మశ్రీ (1970)
ఉత్తమ కథకు జాతీయ చలనచిత్ర పురస్కారం (1974)

1974లో జుక్తి టక్కో ఆర్ గప్పో (Jukti Takko Aar Gappo) చిత్రానికిగానూ ఉత్తమ కథకు జాతీయ చలనచిత్ర అవార్డు రజత్ కమల్ అవార్డు రిత్విక్ ఘటక్ కు వరించింది. తితాష్ ఏక్తి నాదిర్ నామ్ (Titash Ekti Nadir Naam) చిత్రానికి బంగ్లాదేశ్ సినీ జర్నలిస్ట్ అసోసియేషన్ నుండి ఉత్తమ దర్శకుని అవార్డును గెలుచుకున్నాడు. భారత ప్రభుత్వం 1970లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

కుటుంబం

మార్చు

రిత్విక్ ఘటక్ కుమారుడు రితాబన్ ఘటక్ కూడా సినిమా నిర్మాత. రిత్విక్ మెమోరియల్ ట్రస్ట్‌ ను స్థాపించాడు. ఆయన రిత్విక్ ఘటక్ బగలర్ బంగా దర్శన్, రోంగర్ గోలమ్‌ని పునరుద్ధరించాడు. అసంపూర్తిగా ఉన్న రామ్‌కింకర్‌ డాక్యుమెంటరీని పూర్తి చేశాడు.

రిత్విక్ ఘటక్ పెద్ద కూతురు సంహిత, నోబో నాగరిక్ పేరుతో ఒక డాక్యుఫీచర్ చేసింది. రిత్విక్ ఘటక్ చిన్న కూతురు 2009లో మరణించింది.

పురస్కారాలు

మార్చు
  • భారత ప్రభుత్వంచే 1970లో కళలకు పద్మశ్రీ[2][3]
  • 1957లో 5వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మూడవ ఉత్తమ చలనచిత్రంగా ముసాఫిర్ కి గాను మెరిట్ సర్టిఫికేట్
  • మధుమతి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కథా పురస్కారానికి ఎంపిక[4]
  • 1974లో జుక్తి తక్కో ఆర్ గప్పో చిత్రానికి గానూ జాతీయ చలనచిత్ర పురస్కారం రజత్ కమల్ ఉత్తమ కథ
  • 13వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సుబర్ణరేఖకు బెంగాలీలో రెండవ ఉత్తమ చలనచిత్రంగా మెరిట్ సర్టిఫికేట్
  • హీరర్ ప్రజాపతి 1970లో 16వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాలల చలనచిత్ర అవార్డు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Partha Chatterjee (19 October 2007). "Jinxed legacy". Frontline. Archived from the original on 2 May 2008. Retrieved 4 November 2012.
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. p. 39. Archived from the original (PDF) on 14 September 2017. Retrieved 22 January 2019.
  3. "Controversy". Ramachandraguha.in. Retrieved 30 July 2012.
  4. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 639–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 November 2012.