రిలీఫ్ (శిల్పకళ)

శిల్పకళ చిత్రకళల్లో ఒక పద్ధతి

రిలీఫ్ అనేది ఒక శిల్పకళా పద్ధతి. దీనిలో చెక్కిన శిల్పాలు అదె పదార్థపు నేపథ్యంలో భాగంగా ఉంటాయి. రిలీఫ్ అనే పదం లాటిన్ క్రియాపదం relevare నుండి వచ్చింది, ఎత్తడం (వెలికి ఎత్తడానికి). రిలీఫ్‌లో చెక్కిన శిల్పం చెక్కిన శిల్పం దాని నేపథ్యం (క్షేత్రం) పైన ఉబ్బెత్తుగా ఉండి, నేపథ్యం నుండి పైకి చొచ్చుకుని వచ్చినట్లు ఉంటుంది.[1] రాయి లేదా చెక్కల చదునైన ఉపరితలంపై ఒక రిలీఫ్‌ శిల్పాన్ని చెక్కడం అంటే, వాస్తవానికి శిల్పం తక్క మిగతా భాగాన్ని చెక్కెయ్యడం. దాంతో చెక్కని ప్రాంతాలు ఎత్తుగా కనిపిస్తాయి. ఈ విధానంలో క్షేత్రంలో (నేపథ్యంలో) చాలా భాగాన్ని చెక్కేయవలసి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. మామూలుగా గుండ్రంగా చెక్కే శిల్పం కంటే రిలీఫ్ దృఢంగా, తక్కువ పెళుసుగా, మరింత సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా నిలబడి ఉన్న మనిషి బొమ్మ లాంటి శిల్పాల్లో చీలమండల వద్ద రాయి బలహీనంగా ఉంటుంది. రిలీఫ్ శిల్పాల్లో అది ఉండదు. లోహాలు, బంకమన్ను, ప్లాస్టర్ గార, సెరామిక్స్ లేదా పేపియర్-మాచే వంటి ఇతర పదార్థాలలో మూర్తిని నేపథ్యంపై అతికిస్తే సరిపోతుంది. కంచుతో చేసిన స్మారక రిలీఫ్‌లను పోత పోసి తయారు చేస్తారు.

ఇటలీ లోని ఫ్లోరెన్స్‌లోని ఫ్లోరెన్స్ బాప్టిస్టరీ వద్ద కంచులో పోతపోసిన గేట్స్ ఆఫ్ ప్యారడైజ్ రిలీఫ్ ను పక్కనుండి చూసిన దృశ్యం. ఎక్కువ-రిలీఫ్‌లో ఉన్న ప్రధాన వ్యక్తులను తక్కువ రిలీఫ్‌లో ఉన్న నేపథ్యాలతో కలపడం. శిల్పి: లోరెంజో ఘిబెర్టీ

నేపథ్యం (క్షేత్రం) నుండి చెక్కిన రూపం ఉబ్బు స్థాయిని బట్టి వివిధ స్థాయిల రిలీఫ్‌లు ఉన్నాయి. అవి, హై రిలీఫ్[2] - అంటే లోతు 50% కంటే ఎక్కువ ఉంటుంది, మిడ్-రిలీఫ్, లో రిలీఫ్‌ (బాస్ రిలీఫ్ అని కూడా అంటారు) లు.[3] తక్కువ రిలీఫ్‌లలో క్షేత్రం, చెక్కిన శిల్పాల కంటే కొంచెమే లోతుగా ఉంటుంది. సంక్ రిలీఫ్ కూడా ఉంది. ఇది ప్రధానంగా పురాతన ఈజిప్టులో కనిప్స్తుంది. హై, లో రిలీఫ్‌ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంటుంది. ఈ రెండూ సాధారణంగా ఆయా శిల్పాల గురించి చర్చించడానికి ఉపయోగించే పదాలు మాత్రమే.

ఈ పదాల నిర్వచనాలు కొంతవరకు మారుతూంటాయి. అనేక రిలీఫ్‌లలో ఒకటి కంటే ఎక్కువ రకాలు మిళితమై ఉంటాయి. అందుచేత కొంతమంది శిల్పులు వీటీ మధ్య ఉన్న భేదాలను పట్టించుకోరు.[4] రిలీఫ్ శిల్పానికి వ్యతిరేకమైన శిల్ప పద్ధతిని కౌంటర్-రిలీఫ్ అని అంటారు.[5] ఈ పద్ధతిలో చిత్రాన్ని చుట్టూ ఉన్న నేపథ్యం లోకి తొలిచి శిల్పాన్ని తయారుచేస్తారు; అంటే శిల్పానికి క్షేత్రానికీ మధ్య ఒక గుంట ఉంటుంది. స్మారక శిల్పాల్లో ఈ పద్ధతిని చాలా అరుదుగా వాడతారు. ఈ పద్ధతిలో సృష్టించిన శిల్పాలను, ముఖ్యంగా స్మారక శిల్పాలను, "రిలీఫ్‌లో ఉన్నాయి" అని అంటారు. శిల్పాన్ని "రిలీఫ్" అంటారు.

లండన్‌లోని ఆల్బర్ట్ మెమోరియల్ స్థావరం చుట్టూ ఉన్న పర్నాసస్ హై-రిలీఫ్ ఫ్రైజ్ ముఖం. తలల్లో అధికభాగం, అనేక పాదాలు పూర్తిగా అండర్ కట్ చేయబడ్డాయి. కానీ మొండేలు మాత్రం వెనుక ఉపరితలంతో కలిసి ఉన్నాయి

భవనాల గోడలపై, వివిధ రకాల చిన్న సెట్టింగులపై చెక్కిన రిలీఫ్‌ శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. వరుసగా ఉన్న అనేక ప్యానెల్‌లు లేదా రిలీఫ్‌లు ఓ కథనాన్ని సూచించవచ్చు. అనేక బొమ్మలు ఉండే యుద్ధాల వంటి చురుకైన భంగిమలతో కూడిన సంక్లిష్టమైన విషయాలను చిత్రించడానికి స్వేచ్ఛగా ఉండే "పూర్తి శిల్పాల" కంటే రిలీఫ్ ప్రక్రియ మరింత అనుకూలంగా ఉంటుంది. చాలా పురాతన రిలీఫ్‌లను ముందుగా రంగులతో చిత్రించి ఆపై క్షేత్రాన్ని చెక్కి తయారుచేసారు. ఇది తక్కువ రిలీఫ్‌లో రూపాలను ముందే నిర్వచించుకోడానికి ఇది సహాయపడింది. ఇస్లామిక్ కళలోని అరబెస్క్యూలలో వలె అలంకార జ్యామితీయ లేదా ఆకుల నమూనాలను తదితర చిత్రించడానికి రిలీఫ్‌లను వాడతారు.

రోమన్ అరా పాసిస్‌లో, దిగువ నుండి కనిపించేలా ఉంచబడిన ఎక్కువ, తక్కువ రిలీఫ్‌ల మిశ్రమం. తక్కువ రిలీఫ్ నేపథ్యం.

బహిరంగ ప్రదేశంలో రాతిలో చెక్కినవాటిని రాతి రిలీఫ్‌లు అంటారు (గుహలలో ఉండే రిలీఫ్‌లను - అవి సహజమైనవైనా లేదా మానవ నిర్మితమైనవైనా - "రాతిలో చెక్కిన" (రాక్-కట్) అని అంటారు). ఈ రకం అనేక సంస్కృతులలో, ప్రత్యేకించి ప్రాచీన సమీప తూర్పు బౌద్ధ దేశాలలో, కనిపిస్తుంది. ఒక శిలాఫలకం అంటే నిలబడి ఉన్న ఏకశిల; ఇవి ఎక్కువగా రిలీఫ్‌లు అయి ఉంటాయి.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Relief". Merriam-Webster. Archived from the original on 2012-05-31. Retrieved 2012-05-31.
  2. In modern English, just "high relief"; alto-rilievo was used in the 18th century and a little beyond, while haut-relief surprisingly found a niche, restricted to archaeological writing, in recent decades after it was used in under-translated French texts about prehistoric cave art, and copied even by English writers. Its use is to be deprecated.
  3. Murray, Peter & Linda, Penguin Dictionary of Art & Artists, London, 1989. p. 348, Relief; bas-relief remained common in English until the mid 20th century.
  4. For example Avery in Grove Art Online, whose long article on "Relief sculpture" barely mentions or defines them, except for sunk relief.
  5. Murray, 1989, op.cit.
  6. Kleiner, Fred S.; Mamiya, Christin J. (2006). Gardner's Art Through the Ages: The Western Perspective – Volume 1 (12th ed.). Belmont, California, US: Thomson Wadsworth. pp. 20–21. ISBN 0-495-00479-0.