రుక్న్-ఉద్-దౌలా సరస్సు
రుక్న్-ఉద్-దౌలా సరస్సు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శివరాంపల్లిలో ఉన్న ఒక చారిత్రక సరస్సు.[1] శివరాంపల్లి గ్రామం రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం పరిధిలోకి వస్తుంది.
రుక్న్-ఉద్-దౌలా సరస్సు | |
---|---|
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°19′54″N 78°26′31″E / 17.3318°N 78.4420°E |
రకం | సరస్సు |
నిర్మాణం | 1770 |
ఉపరితల వైశాల్యం | 104 ఎకరం (42 హె.) |
చరిత్ర
మార్చుహైదరాబాదు 3వ నిజాం రాజు సికందర్ జా కాలంలో 1765 నుండి 1775 వరకు ప్రధానమంత్రి పనిచేసిన నవాబ్ రుక్న్ -ఉద్ -దౌలా 1770లో ఈ సరస్సును నిర్మించాడు.[2] ప్రారంభంలో 104 ఎకరాలు ఉన్న ఈ సరస్సు తరువాతికాలంలో ఆక్రమణలకు గురైంది.[3] [4] మీర్ ఆలం ట్యాంక్‌కు ఎదురుగా, హసన్ నగర్ జాతీయ పోలీసు అకాడమీ సమీపంలో ఈ సరస్సు ఉంది.
ఈ సరస్సు నుండి వచ్చే స్వచ్ఛమైన నీటిని నిజాం, వారి కుటుంబ సభ్యులు తాగడానికి ఉపయోగించేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బారెల్స్‌లో ఈ నీటిని నింపి దారుగ (రాజ కుటుంబాలు, రాయల్ గెస్ట్స్ కోసం ఆహార తనిఖీ కోసం నియమించిన ప్రత్యేక అధికారి) సమక్షంలో సీలు చేసి ఎద్దుల బండ్లలో చౌమహల్లా ప్యాలెస్కు తీసుకువెళ్ళేవారు.
ప్రస్తుత స్థితి
మార్చుకొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదలతో భూకబ్జాదారులు ఈ సరస్సును ఆక్రమించి, నిర్మాణాలు చేశారు.[3][5] ఇందులోని నీరు కూడా కలుషితమైంది.
ఇతర వివరాలు
మార్చు- గతంలో కొంతమంది ఇక్కడ వాటర్ బెడ్‌ను డంపింగ్ చేస్తుండడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అది నిలిపివేయబడింది.
- 2017లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్, సేవ్ అవర్ అర్బన్ లేక్ కలిసి 2017లో సరస్సును తనిఖీ చేసి, సరస్సు చుట్టూ పూర్తిస్థాయిలో కంచె నిర్మించడం ద్వారా ఆక్రమణల నుండి రక్షించబడుతుందని నివేదిక ఇవ్వడం జరిగింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Need to ensure protection of Rukn ud Daula Lake". The Siasat Daily - Archive (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-20.
- ↑ "Construction on historic lake bed stalled". Times of India. 20 April 2011. Retrieved 2021-10-20.
- ↑ 3.0 3.1 Jan 25, Moulika KV | TNN | Updated; 2019; Ist, 12:53. "Hyderabad: 250-year-old lake under threat by land sharks | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ India, The Hans (2018-08-02). "Save Bum-Rukn-ud-Dowla lake, demands SOUL". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-20.
- ↑ "Municipal Administration and Urban Development is destroying the lake, says SOUL activist". The New Indian Express. Retrieved 2021-10-20.
- ↑ Jan 25, Moulika KV / TNN / Updated:; 2019; Ist, 12:53. "Hyderabad: 250-year-old lake under threat by land sharks | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)