రుద్రవరం (అచ్చంపేట)
రుద్రవరం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం లోని గ్రామం. పిన్ కోడ్:522 412. ఊరి చుట్టూరా పచ్చని పొలాలు, ఎత్తయిన కొండలు, ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తోంది. ఊరిలో. శ్రీ సీతారామస్వామి ఆలయం ప్రధానమైనది. ప్రతి ఏటా ఊరిలో పండగలు చాల వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఇక్కడ ప్రాముఖ్యత చెందింది. ఊరిలో కమ్మ, రెడ్లు, రాజులు, యాదవులు ఉంటారు. పచ్చా, గడ్డం, గంటా, బిక్కి, వడ్లమూడి, చల్లా, తల తల, అన్నపురెడ్డి వంటి ఇంటి పేర్లున్నాయి. మిరప, ప్రత్తి, వరి వంటి పంటలు పండుతాయి. చాల మందికి పొలం ఉంది . మండల కేంద్రం అచ్చంపేట నుండి ఇది 6 కిలోమీటర్ల దూరములో ఉంది. ఎటువంటి సరుకులకైన, ఇతర అవసరాలకు చాల మంది అక్కడికి వెళ్తారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామం. గ్రామం మొత్తం సుమారు 400 ఇళ్ళు ఉంటాయి.1983 లో పచ్చా. వేంకటాద్రి గారు వాళ్లకి ఉన్న పొలం లో కొంత ఊరు అభివృద్ధి చెందడం లక్ష్యంగా, ఇల్లు స్థలాలకి తక్కువ ఖర్చుకి ఇచ్చారు.
రుద్రవరం | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′35″N 80°05′31″E / 16.376328°N 80.091903°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | అచ్చంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522412 |
ఎస్.టి.డి కోడ్ |