రుస్తుం-2 అనేది మానవరహిత వైమానిక వాహనం (UAV) విమానం.దీనిని, దీనిని భారత రక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డీ.ఓ./ DRDO (Defence Research and Development Organisation) తయారు చేసింది.దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (UAV) రుస్తుం - 2 (తపస్ - 2001) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. దీనిని మొదటి సారి ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలను నవంబరు 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక నుండి నిర్వహించినట్లు DRDO వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తుం మద్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా వినియోగించవచ్చు. DRDO బెంగుళూరు, హిచ్ ఎ ఎల్ - వీఈఎల్‍లు సంయుక్తంగా రుస్తుం - 2 ను అభివృద్ధి చేశాయి[1].

స్వదేశీయంగా భారతరక్షణ వ్యవస్థకు చెందిన డీ.ఆర్.డి.ఒ చేసిన రుస్తుం-2 ను మరోసారి99 ఫిబ్రవరి00 25 (అదివారం, కర్నాటక రాష్ట్రం లోనిచిత్రదుర్గ జిల్లా చెళ్లకేరళో వున్న వైమానిక పరీక్ష స్థావరం నుండి విజయవంతంగా ప్రయోగించారు.ఈ మానవరహిత వైమానిక వాహనం ఎక్కువ సేపు విహరించే సామర్ద్యం కల్గి ఉంది.ఎకాబికి 24 గంటలు ఆకాశంలో ఎగరగలదు.దీనిని రక్షణ రంగానికి చెందిన మూడు దళాలు (ఆర్మీ, నౌకాదళం. వాయుసేనలు) ఉపయోగించు కోవచ్చును.ఈ ప్రయోగాన్ని డీ.ఆర్.డి.ఒ చైర్మెన్ ఎస్.క్రిస్టఫర్, ఎయిరోనాటికల్ సిస్టమ్ డైరెక్టరు జనరల్ సి.పి రామనారాయణన్, మరియుఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేసన్స్ డైరెక్టరు జనరల్ జె.మంజుల, ఇతర అనుభవమున్న విజ్ఙాన వేత్తల సమక్షంలో నిర్వహించారు.[2]

రుస్తుం-2

మార్చు

రుస్తుం-2 అనేది మానవరహిత వైమానిక వాహనం. ఇది మానవరహిత వైమానిక వాహనం నిర్మాణ, ప్రయోగ వ్యవస్థకు చెందిన చిన్న విమానం.రుస్తుం-I, రుస్తుం-H, రుస్తుం-C లు కూడా మానవ రహిత వైమానిక వాహన వ్యవస్థకు చెందినవే. మధ్యస్థ ఎత్తులో ఎగురు ఈ మానవరహిత వైమానిక వాహనాన్ని రక్షణ త్రిదళాలు ఉపయోగించుకోనేలా తయారు చేసారు. 20,000 అడుగుల ఎత్తులో 20 గంటలసేపు విహరించ గలదు. రుస్తుం-2 ను H UCAV మాదిరి ఆధారంగా తక్కువ బరువుతో ఆకారం/నిర్మాణం వుండేలా రూపొందించారు. రుస్తుం-2 మూడూ రెక్కలున్న ఎన్.పి.ఒ సాటర్నుఇంజనులను ( NPO saturn engines) కల్గి ఉంది.ఈ టర్బో ఇంజనులు ఒక్కోకటి 45 కిలోగ్రాముల తోపుడు శక్తిని కల్గించును. ఈ వాహనం ఎత్తు 2.4 మీటర్లు, పొడవు9.5, మొత్తం పొడవు 20.6 మీటర్లు.ఈ వైమానిక వాహనం తోకలో T రకపు నిలువు స్థిరీకరించే వ్యవస్థకల్గి ఉంది. తోక క్షితిజ సమాంతర సమతలాన్నికల్గివున్నది. ఈ మానవరహిత వైమానిక వాహనం గంటకు 280 కిలో మీటర్ల వేగంతో పయనిస్తుంది.ఇది Medium Range Electro Optic (MREO), Long Range Electro Optic (LREO), Synthetic Aperture Radar (SAR), Electronic Intelligence (ELINT), Communication Intelligence (COMINT) and Situational Awareness Payloads (SAP) వంటి పలు అవసర ఉపకరాణాలు మోసికొనిపోవు సామర్ధ్యం కల్గి వున్నది[3].ఇది ఆయుధాలను మోసికొనిపోగలదు.

బయటి లింకుల వీడియోలు

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "యూఏవీ (UAV) రుస్తం-2 తొలి పరిక్షలు విజయవంతం". vyoma.net. Archived from the original on 2018-02-26. Retrieved 2018-02-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "drdo-successfully-test-flies-rustom-2-". news18.com. Archived from the original on 2018-02-25. Retrieved 2018-02-26.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "What is Rustom 2 drone?". indianexpress.com. Archived from the original on 2018-02-25. Retrieved 2018-02-26.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రుస్తుం-2&oldid=3836118" నుండి వెలికితీశారు