రూపిందర్ పాల్ సింగ్

రూపిందర్ పాల్ సింగ్(జననం 1990 నవంబరు 11) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2014 కామన్వెల్త్ ఆటలు, 2016 ఒలింపిక్ ఆటలు, 2018 కామన్వెల్త్ ఆటలు అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టులో ఆడాడు.[1]

రూపిందర్ పాల్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1990-11-11) 1990 నవంబరు 11 (వయస్సు 31)
పంజాబ్
ఎత్తు 1.94 m
ఆడే స్థానము డిఫెండర్
జాతీయ జట్టు
2010–ప్రస్తుతం భారత జాతీయ పురుషుల మైదాన హాకీ జట్టు 216 (115)

తొలినాళ్ళ జీవితంసవరించు

రూపిందర్ పాల్ సింగ్ పంజాబ్ రాష్ట్రం ఫరిద్కోట్ లోని ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఇతను తన 11వ ఏటా నుండి హాకీ ఆడటం మొదలెట్టాడు. చండీగఢ్ హాకీ అకాడెమీకి ఎంపికైనప్పటినుండి ఆట పై ఇతనికి మరింత మక్కువ పెరిగింది. [2]

కెరీర్సవరించు

సింగ్ 2010 మేలో మొట్టమొదటి సారి సుల్తాన్ అజ్లాన్ షాహ్ కప్ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాడు. ఆ మరు సంవత్సరం 2011 లో జరిగిన అజ్లాన్ కప్ పోటీల్లో ప్రత్యర్థి అయినా బ్రిటన్ జట్టుపై రూపిందర్ హ్యాట్రిక్ గోల్స్ చేసాడు. 2014 పురుషుల మైదాన హాకీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.[3][4] 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టులో ఆడి, జట్టు విజయానికి తనదైన పాత్ర పోషించాడు.

మూలాలుసవరించు

  1. "Drag-flick glory beckons Rupinder Pal". 2011-07-08. Retrieved 2014-08-03.
  2. "Men's Rabobank Hockey World Cup 2014". 2014-05-24. Archived from the original on 2014-07-02. Retrieved 2014-08-04.
  3. "Men's Rabobank Hockey World Cup 2014". 2014-05-24. Archived from the original on 2014-07-02. Retrieved 2014-08-04.
  4. "Sultan Azlan Shah Cup: Rupinder Pal Jubilant After Hat-rick Against Great Britain". 2011-05-06. Retrieved 2014-01-08.

బయటి లింకులుసవరించు