రూపిణి
కోమల్ మహువకర్, ఆమె రంగస్థల పేరు రూపిణితో బాగా ప్రసిద్ది చెందింది. 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషా చిత్రాలలో నటించిన భారతీయురాలు.[2]
రూపిణి | |
---|---|
జననం | కోమల్ మహువకర్ 1969 నవంబరు 4[1] ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1975–2020 |
భాగస్వామి | మోహన్ కుమార్ |
పిల్లలు | 1 |
ప్రారంభ జీవితం
మార్చురూపిణి ముంబైలో బాగా చదువుకున్న కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి డైటీషియన్.[3][4] ముంబైలోని లచ్చు మహారాజ్ వద్ద నాలుగేళ్ల వయసులో నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె తక్కువ వ్యవధిలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లతో సహా అన్ని రకాల శాస్త్రీయ నృత్యాలను నేర్చుకుంది.
కెరీర్
మార్చుమిలీ (1975), కొత్వాల్ సాబ్ (1977), ఖుబ్సూరత్ (1980) వంటి చిత్రాలలో ఆమె బాలనటిగా చేసింది. ఆమె కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. ఆమె పాయల్ కి ఝంకార్ (1980), (1980), ఘుంగ్రూ (1983), మేరీ అదాలత్ (1984), ఆవారా బాప్ (1985) వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడం ప్రారంభించింది. కూలీక్కారన్ (1987), మనిథన్ (1987), ఎన్ తంగచి పడిచావా (1988), అపూర్వ సగోధరార్గల్ (1989), మైఖేల్ మదన కామ రాజన్ (1990), మదురై వీరన్ ఎంగా, సామీ (1990) వంటి దక్షిణ భారత చలనచిత్రాలలో ఆమె నటించింది.
బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో చేస్తున్నప్పుడు ఆమె అసలు పేరు, రంగస్థల పేరు రెండింటితోనూ గుర్తించబడింది.[5]
1995లో వివాహనంతరం ఆమె సినిమాలకు దూరమై 2020లో తమిళ టెలివిజన్ ధారావాహిక చితి 2తో తిరిగి వచ్చింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చు1995లో మోహన్ కుమార్‌తో వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పింది. చెంబూర్‌లో తన కుటుంబంపై దృష్టి సారించింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల కోసం అక్కడ గుండె ఆసుపత్రిని ప్రారంభించింది. దానికి యూనివర్సల్ హార్ట్ హాస్పిటల్ అని పేరు పెట్టింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుతెలుగు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
1989 | ఒంటరి పోరాటం | ఇందు | |
1994 | గాండీవం | రేఖ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర | ఛానెల్ | గమనిక |
---|---|---|---|---|
2005-2006 | వో రెహ్నే వాలీ మెహ్లోన్ కీ | శీతల్ మిట్టల్ | సహారా వన్ | |
2020 | చితి 2 | పద్మ షణ్ముగప్రియన్ | సన్ టీవీ | 26 ఏళ్ల తర్వాత పునరాగమనం |
మూలాలు
మార్చు- ↑ https://celtalks.com/celebs/rupini?ID=894
- ↑ "Rupini" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-19.
- ↑ "തിരിച്ചുവരവ് ആലോചിച്ചിട്ടില്ലെന്ന് രൂപിണി". Mathrubhumi (in మలయాళం). 20 December 2009. Archived from the original on 19 December 2013. Retrieved 3 June 2022.
- ↑ NSK (20 August 1988). "How Roopini graduated to stardom". The Indian Express. p. 18. Retrieved 3 June 2022.
- ↑ https://www.bollymints.com/articles/12-popular-actresses-who-opted-for-a-name-change-mid-career
- ↑ "Serial Chithi 2 Characters And Artist Name - Latest Tamil Series On Sun TV". indiantvinfo.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-28. Retrieved 2023-12-19.