రూబెన్ డేవిడ్
రూబెన్ డేవిడ్ (1912 సెప్టెంబరు 19 - 1989 మార్చి 24) జంతు శాస్త్రవేత్త, భారతదేశంలోని గుజరాత్ అహ్మదాబాద్ కాంకరియా జంతు ప్రదర్శనశాల స్థాపకుడు.[1]
జీవిత చరిత్ర
మార్చుఅతను అహ్మదాబాద్లోని బెనె ఇజ్రాయెల్ యూదు కుటుంబంలో జన్మించాడు.[2] అతను జోసెఫ్ డేవిడ్ చిన్న కుమారుడు.[3] అతను స్వయంగా అభ్యసించిన పశువైద్యుడు. నగరంలో జంతుప్రదర్శనశాలను నిర్మించడానికి 1951లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అతనిని ఆహ్వానించింది.[2] అతను కాంకరియా జంతుప్రదర్శనశాలను (ఇప్పుడు కమలా నెహ్రూ జూలాజికల్ గార్డెన్), చాచా నెహ్రూ బల్వాటికా (చిల్డ్రన్స్ పార్క్), నేచురల్ హిస్టరీ మ్యూజియంను కూడా స్థాపించాడు, తరువాత దీనికి ఆయన పేరు పెట్టారు.[4][5][6][7] క్యాన్సర్ కారణంగా అతను మాట్లాడుటను కోల్పోయాడు. [6] అహ్మదాబాద్లోని సుందర్వన్, గాంధీనగర్ ఇంద్రోడా పార్కులకు సలహాదారుగా కూడా పనిచేశాడు.[4]
అతను గుజరాత్ ప్రభుత్వంలో రిటైర్డ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అయిన ఎం. ఎ. రషీద్తో కలిసి ది ఆసియాటిక్ లయన్ (1991) ను రచించాడు.[4]
అతనూ జూలాజికల్ సొసైటీ (FZS) లో ఫెలోగా ఉన్నాడు .[8] 1975లో భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీ తో సత్కరించింది.[4]
ఆస్ట్రేలియన్ మానవ శాస్త్రవేత్త కోలిన్ గ్రోవ్స్ 1981లో చరిత్రపూర్వ వార్థాగ్ను కనుగొని, మధ్య ఆసియా పందికి అతని పేరు మీద సుస్ స్క్రోఫా డేవిడి అని పేరు పెట్టారు.[5][8]
వ్యక్తిగత జీవితం
మార్చురచయిత్రి ఎస్తేరు డేవిడ్ అతని కుమార్తె.[5]
మూలాలు
మార్చు- ↑ "Reuben David (1912 -1989) - Esther David". Esther David (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-09-19.
- ↑ 2.0 2.1 "Animal instinct". intoday.in.
- ↑ Gujarat State Gazetteer (in ఇంగ్లీష్). Director, Government Print., Stationery and Publications, Gujarat State. 1989. p. 342.
- ↑ 4.0 4.1 4.2 4.3 "AMC to mark 100th birth anniversary of zoologist Reuben David today". Indian Express. Retrieved 2014-02-24.
- ↑ 5.0 5.1 5.2 John, Paul (2019-09-28). "Reuben David's legacy crumbling into oblivion". The Times of India.
- ↑ 6.0 6.1 "Ahmedabad zoo architect Reuben David remembered on 100th birth anniversary". The Indian Express. 2012-09-20.
- ↑ Thomas, Amelia (11 January 2008). The Zoo on the Road to Nablus. PublicAffairs. ISBN 9781586486587.
- ↑ 8.0 8.1 Groves, Colin P. (1981). Ancestors for the Pigs: Taxonomy and Phylogeny of the Genus Sus (in ఇంగ్లీష్). Department of Prehistory, Research School of Pacific Studies, Australian National University. p. 38. ISBN 978-0-909596-75-0.