రూబెన్ హఖ్వెర్ద్యాన్

రూబెన్ హఖ్వెర్ద్యాన్,  ఒక ప్రఖ్యాత ఆర్మేనియన్ కవి, గిటారిస్ట్, గాయకుడు, పాటల రచయిత. హఖ్వెర్ద్యాన్ ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో 1950వ సంవత్సరంలో జన్మించారు.[1] ఆయన యెరెవాన్ యొక్క థియేటర్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు. తన టెలివిజన్, థియేటర్ దర్శకత్వ డిగ్రీను 1975 లో సంపాదించారు. అతను నగరంలోని ప్రభుత్వ టెలివిజన్ నెట్వర్క్ లో పనిచేశారు.[2]

రూబెన్ హఖ్వెర్ద్యాన్
2016లో జరిగిన ఒక సమావేశాంలో హఖ్వెర్ద్యాన్ (మధ్యలో)
వ్యక్తిగత సమాచారం
జననండిసెంబరు 3, 1950
యెరెవాన్, ఆర్మేనియా, సోవియంట్ యూనియన్
వాయిద్యాలుగిటారు
క్రియాశీల కాలం1968—
వెబ్‌సైటుwww.roubenhakhverdyan.net

హఖ్వెర్ద్యాన్ యొక్క పాటలు అర్మేనియాలో చాలా ప్రజాదరణ పొందాయి. వాటిలో "నావఖ్" (పడవ) పాట ఉన్నది, ఇది పిల్లల పాటగా అత్యంత ప్రసిద్ధ చెందింది. ఇతర ప్రముఖ పాటలలో, "మెర్ సిరో అషూన్" (శరదృతువే మా ప్రేమ) ఉంది. ఇది ఆర్మేనియాలో ఉత్తమ శృంగార పాటగా ప్రఖ్యాత పొందింది. హఖ్వెర్ద్యాన్ తనకు ఇష్టమైన మూడు పాటలని స్వయంగా చెప్పారు, అవి తనని ప్రభావితం చేసినవని అతనికి అన్ని-సమయాలలో ఇష్టమైనవి బీటిల్స్ పాడిన ఎలియనోర్ రిగ్బి, జక్వెస్ పాడిన ఆమ్స్టర్డ్యామ్ , జేమ్స్ బ్రౌన్ పాడిన ఇట్స్ ఎ మ్యాంస్ వోల్డ్.

జీవిత చరిత్ర, కెరీర్

మార్చు

రూబెన్ హఖ్వెర్ద్యాన్ ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో 1950వ సంవత్సరంలో జన్మించారు. అతను భాషావేత్త, విద్యావేత్త లెవాన్ హఖ్వెర్ద్యాన్, గ్రోట్తో, విమర్శకుడు, అనువాదకుడు సొనా ఆయుంట్స్ కు జన్మించారు. 1969-1974లో అతను యెరెవాన్ ఫైన్ ఆర్ట్స్, థియేటర్ ఇన్స్టిట్యూట్ లో అధ్యయనం చేసి పట్టభద్రుడయ్యాడు. 1971 లో వచ్చింది అతనుకు మార్క్ జఖారోవ్ యొక్క మాస్కో వ్యంగ్య థియేటర్ వద్ద రెండు నెలల ఇంటర్ంషిప్పు వచ్చింది. 1968-1989 మధ్య హఖ్వెర్ద్యాన్ ఆర్మేనియన్ రాష్ట్ర టెలివిజన్ నెట్వర్క్ లో, ప్రారంభంలో ఒక అసిస్టెంట్ డైరెక్టరు, తరువాత ఒక డైరెక్టరుగా పనిచేశారు.

హఖ్వెర్ద్యాన్ యెరెవాన్ సుందుక్యా అకాడమీలో, హ్రచ్యా ఘప్లన్యన్ డ్రామా ధియేటర్లలో నాటకాలు ప్రదర్శించారు. హఖ్వెర్ద్యాన్ 1989 లో తన టెలివిజన్ ఉద్యోగాన్ని వదిలివేసి ఒక ఉచిత కళాకారుడిగా పనిచేశారు.[3]

రూబెన్ హఖ్వెర్ద్యాన్ ఎన్నో పాటలను రచించారు, పాడారు. వాటిలో మొదటిది "సాంగ్స్ ఆఫ్ లవ్ ఆర్ స్నో"  పారిస్ లో 1985న జారీ చేశారు. వాటిలో బాగా తెలిసిన పాటలు, "స్నో" ("Ձյունը") [4], "డాగ్స్" ("Շները"), "నైట్స్ ఆఫ్ యెరెవాన్" ("Երևանի գիշերներում") మొదలగునవి ఉన్నవి [5]. 1996 లో, అతను సృష్టించిన "మై హోం ఆన్ ది వీల్స్" కచేరీ ప్రదర్శనను పిల్లల పాటలుగా పాడుకుంటారు.

అతను కంపోస్ చేసిన పాటలలో పాట "స్టార్-స్పాంగ్ల్డ్ నైట్ ముఖ్యమైనది. తరువాత అది "ఫౌండ్ డ్రీమ్" "కల" కార్టూన్ యానిమేషన్ లో కనపడింది.

అతను ఫ్రాన్సు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుగోస్లేవియా, ఇటలీ, లెబనాన్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, సెర్బియా, ఇరాన్, సిరియా లలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.[6]

సినిమాలు

మార్చు
  • 1988-1989 లో హఖ్వెర్ద్యాన్ హరుత్యున్ కచత్ర్యన్ యొక్క విండ్ ఆఫ్ అబ్లివియన్ సినిమాలో
  • 2009 లో హరుత్యున్ కచత్ర్యన్ యొక్క ఎండ్లెస్ రెటర్న్ సినిమాలో నటించారు

అవార్డులు

మార్చు
  • మూవ్సెస్ ఖోరెనాట్సి పతకం, 1998
  • సాంస్కృతిక శాఖ నుండి బంగారు పతకము, 2006
  • 2008 లో హఖ్వెర్ద్యాన్ యొక్క "ఫ్రం ద ఏజ్ ఆఫ్ 0 టూ 100 ఇయర్స్ ఓల్డ్"[7] తెకెయాన్ సాంస్కృతిక సంగం నుండి అరా అండ్ మరల్ ను గెలుచుకున్నారు.

సూచనలు

మార్చు
  1. "Ruben Hakhverdyan" by Shushan Argakanyan, Yerevan. Bureaucrat, 2011, 536 pages. ISBN 978-9939-9046-0-3
  2. Ruben Hakhverdyan's music profile Archived 2007-09-28 at the Wayback Machine. Armenian Music Center. Retrieved August 26, 2007.
  3. "Ruben Hakhverdyan". Archived from the original on 2018-11-16. Retrieved 2018-06-26.
  4. https://www.youtube.com/watch?v=dQh3UdE4mWM
  5. https://www.youtube.com/watch?v=DPJgPjPY3W4
  6. Who is who? Armenians. Biographical encyclopedia, volume, Yerevan, 2005.
  7. "Ruben Hakhverdyan - 0-Ic 100 Tarekan Yerexanerin". Retrieved 2017-03-18.