రూమ్ నంబర్ 54
రూమ్ నంబర్ 54 2021లో విడుదలైన వెబ్‌సిరీస్. తరుణ్ భాస్కర్ సమర్పణలో ఐ డ్రీమ్ మీడియా బ్యానర్ పై చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ గౌతమ్ దర్శకత్వం వహించాడు. మొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 మే 21న ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది.
రూమ్ నంబర్ 54 | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ్ గౌతమ్ |
నిర్మాత | చిన్నా వాసుదేవ రెడ్డి |
తారాగణం | మొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య |
ఛాయాగ్రహణం | ప్రణవ్, శశాంక్ |
సంగీతం | ధ్రువన్ |
నిర్మాణ సంస్థ | ఐ డ్రీమ్ మీడియా |
విడుదల తేదీ | 21 మే 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఇంజినీరింగ్ చదువుతూ కాలేజీ హస్టల్‌లోని రూమ్ నంబర్ 54లో నలుగురు మిత్రులు బాబాయ్ (కృష్ణతేజ), ప్రసన్న (పవన్ రమేశ్), వెంకట్రావ్ (మొయిన్), యువరాజ్ (కృష్ణప్రసాద్) ఉంటారు. ఆ రూమ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అందులో ఉన్న వారందరికీ నెక్స్ట్ బ్యాచ్ లతో ఒక స్పెషల్ బాండింగ్ వుంటుంది. ఆ రూమ్‌లో దిగిన ఈ నలుగురు కుర్రాళ్లకు ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
మార్చు- మొయిన్
- కృష్ణప్రసాద్
- పవన్ రమేష్
- కృష్ణతేజ
- శ్వేతా
- నవ్య
- సావిత్రి
- ప్రియదర్శి (అతిధి పాత్ర)
- సత్యదేవ్ (అతిధి పాత్ర)
- ఉత్తేజ్ (అతిధి పాత్ర)
- తనికెళ్ళ భరణి (అతిధి పాత్ర)
- కరుణ కుమార్ (అతిధి పాత్ర)
- మిర్చి హేమంత్ (అతిధి పాత్ర)
- చిత్రం శ్రీను (అతిధి పాత్ర)
- జెమినీ సురేశ్ (అతిధి పాత్ర)
- నరసింహా (అతిధి పాత్ర)
- హరీష్ (అతిధి పాత్ర)
- రచ్చ రవి (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:ఐ డ్రీమ్ మీడియా
- సమర్పణ: తరుణ్ భాస్కర్
- నిర్మాత: చిన్నా వాసుదేవ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధార్థ్ గౌతమ్
- సంగీతం: ధ్రువన్
- సినిమాటోగ్రఫీ: ప్రణవ్, శశాంక్
మూలాలు
మార్చు- ↑ Sakshi (24 May 2021). "'రూమ్ నంబర్ 54' వెబ్ సిరీస్ రివ్యూ". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ NTV (25 May 2021). "రివ్యూ: రూమ్ నంబర్ 54 (తెలుగు వెబ్ సీరిస్)". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.