కరుణ కుమార్ భారతీయ చలనచిత్ర దర్శకుడు. కథారచయిత కూడా అయిన ఆయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.[1] 2020లో వచ్చిన పలాస 1978 చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధిచెందాడు.[2]

కరుణ కుమార్
జననం
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం

ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన 2024లో సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నా సామిరంగలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇది నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కిస్తున్న చిత్రం.[3]

కెరీర్

మార్చు

కరుణ కుమార్ తొలి చిత్రం పలాస 1978 మార్చి 2020లో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. కుల వివక్ష, అంటరానితనానికి సంబంధించిన సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.[4] ఫిల్మ్ కంపానియన్, ది టైమ్స్ ఆఫ్ ఇండియాలతో సహా సంవత్సరాంతపు ఉత్తమ చిత్రాల చార్ట్‌లలో ఇది చోటుదక్కించుకుంది.[5] ఆ తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన మెట్రో కథలు స్ట్రీమింగ్ సర్వీస్ ఆహాలో విడుదలైంది.[6] సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రలలో 2021లో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్‌కి దర్శకత్వం వహించాడు.[7]

ఈ చిత్రం విడుదలకు ముందు, జూలై 2021లో, ఆయన చేతిలో ఎనిమిది చిత్రాలు ఉన్నాయని ది హన్స్ ఇండియా కథనం ప్రచురించింది. అయితే, నవంబరు 2021లో, సృజనాత్మక విభేదాల కారణంగా ఆయన మలయాళ చిత్రం నాయట్టు తెలుగు రీమేక్ నుండి వైదొలిగాడు.[8][9]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా దర్శకత్వం స్క్రీన్ ప్లే కథ నటుడు నోట్స్
2020 పలాస 1978 అవును అవును అవును కాదు
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కాదు కాదు కాదు అవును కరుణ
మెట్రో కథలు అవును అవును అవును కాదు
2021 శ్రీదేవి సోడా సెంటర్ అవును అవును కాదు కాదు
2022 కళాపురం అవును అవును కాదు కాదు
TBA మట్కా అవును అవును అవును కాదు [3]

అవార్డులు

మార్చు
సంవత్సరం పురస్కారం విభాగం సినిమా ఫలితం మూలం
2021 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నూతన దర్శకుడు - తెలుగు పలాస 1978 విజేత [10]
2021 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ విజేత [11]

మూలాలు

మార్చు
  1. Bureau, ABP News (2021-08-27). "Sridevi Soda Center Maker Karuna Kumar Will Only Cast Telugu Actors In His Films, Here Is Why". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
  2. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  3. 3.0 3.1 "Directors turns Villains: దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. 'నా సామిరంగ' | directors turns villains in tollywood srikanth addala karuna kumar sj suryah". web.archive.org. 2023-10-08. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "From Palasa 1978 to Orey Bujjiga, here're 5 highly anticipated Telugu movies set to release in March". The Times of India (in ఇంగ్లీష్). 2020-03-02. Retrieved 2021-01-08.
  5. "Best Telugu Movies of 2020 | Top Rated Telugu Films of 2020 | Top 30 Best Telugu Movies of 2020 | Etimes". timesofindia.indiatimes.com. Retrieved 2022-01-05.
  6. Metro Kathalu Review: An incomplete anthology that doesn't offer what it promises, retrieved 2022-01-05
  7. Dundoo, Sangeetha Devi (2021-08-27). "'Sridevi Soda Center' movie review: Succumbing to mainstream masala". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-05.
  8. "Sridevi Soda Center Movie Review: Predictable screenplay kills the game". Cinema Express. 2021-08-27.
  9. "Karuna Kumar quits Nayattu Telugu remake?". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
  10. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
  11. Naresh. "Suman TV - South Indian Film Awards: సంతోషం - సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ - Suman TV" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-14. Retrieved 2021-11-14.