రేకందార్ ప్రేమలత
రేకందార్ ప్రేమలత ప్రముఖ రంగస్థల నటి.
రేకందార్ ప్రేమలత | |
---|---|
జననం | ఆగష్టు 21, 1957 మేడివాడ, రావికమతం మండలం, విశాఖపట్టణం జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
తండ్రి | వనారస వెంకట్రావు |
తల్లి | భువనేశ్వరి |
జననం
మార్చురేకందార్ ప్రేమలత 1957, ఆగష్టు 21 న శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలంలోని మేడివాడలో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
మార్చుఈవిడ పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది. గంగ, కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, శశిరేఖ, శూర్పణఖ, ఊర్వశి, మాతంగ కన్య, రంభ, రాధాభాయి, పార్వతి, కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, ప్రహ్లాదుడు, మన్మథుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.
మూలాలు
మార్చు- రేకందార్ ప్రేమలత, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 57.