రేచుక్క-పగటిచుక్క

(రేచుక్క పగటిచుక్క నుండి దారిమార్పు చెందింది)

ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళంలో రాజ సేవయ్ అనే పేరుతో, కన్నడంలో "రాజశేఖర" అనే పేరుతోను ఒకే సారి నిర్మించారు.

రేచుక్క-పగటిచుక్క
(1959 తెలుగు సినిమా)
Rechukkapagatichukka.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
షావుకారు జానకి,
ఎస్.వి.రంగారావు
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ స్వస్తిక్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

కథసవరించు

చక్రవర్తి వీరరాఘవులు (సీఎస్‌ఆర్) అసమర్ధుడు, పిరికివాడు. దీంతో అతని తమ్ముడు విక్రమసింహుడు అధికారం చెలాయిస్తుంటాడు. సామంత రాజు విజయరాయలు (ఎస్‌వి రంగారావు), భార్య సుమతి (కన్నాంబ) తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా, సమావేశానికి హాజరుకావాలంటూ చక్రవర్తి నుంచి ఆహ్వానం వస్తుంది. ఆ సభలో విక్రమసింహుని వల్ల తాను గర్భవతినయ్యానని, తనను స్వీకరించమని ఆటవిక నాయకుడు పులిరాజు (మహంకాళి వెంకయ్య) కుమార్తె గౌరి (ఎస్ వరలక్ష్మి) వేడుకుంటుంది. అయితే విక్రమసింహుని తిరస్కారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దానికి ఆగ్రహించిన పులిరాజు, అతని అనుచరులను విక్రముడు దండించబోగా విజయరాయలు వారిస్తాడు. దాంతో విక్రమసింహుడు విజయరాయలను బంధించి అతని తోట తగలబెట్టిస్తాడు. ఆ ప్రమాదం నుంచి సుమతి, కొడుకు తప్పించుకుంటారు. పులిరాజు విజయరాయలను విడిపించి తనతో తీసుకెళ్తాడు. రాయలకోసం వెళ్లిన సేనాధిపతి ధర్మదేవుడు (నాగయ్య)కి బాలుడు, దాదిగా సుమతి లభిస్తారు. వారిని తన భవనానికి తెస్తాడు. విజయరాయలు రేచుక్కగా మారి విక్రమసింహుని అన్యాయాలు ఎదిరిస్తుంటాడు. చక్రవర్తి వీరరాఘవులుకు జన్మించిన ఆడపిల్లను విక్రమ్ అంతం చేయబోగా రేచుక్క ఆ పిల్లను రక్షించి పెంచి పెద్దచేస్తాడు. విజయ్‌కుమార్ (ఎన్టీఆర్)గా పెరిగిన రాయల కుమారుడు సకల విద్యలునేర్చి విజయదశమి వేడుకల్లో పోటీల్లో స్నేహితుడు అయోమయం (రేలంగి)తోపాటు పాల్గొంటాడు. అంతకుముందుగా విక్రమసింహుని కుమారుడు ఉత్తరకుమారుని (రాజనాల) రేచుక్క బంధిస్తాడు. పోటీల్లో విజయం సాధించిన విజయుని, తన కుమారుని విడిపించి రేచుక్కను బంధించి తెమ్మని విక్రమసింహుడు ఆదేశిస్తాడు. ఆరు నెలల గడువులో సాధించమన్న ఆ లక్ష్యం కోసం వెళ్లిన విజయుడు, యువరాణిని (జానకి) కలుసుకోవటం, ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది. తొలుత ఉత్తర కుమారుని విడిపించి, ఆపైన రేచుక్కతో తలపడి అతన్ని బంధించి తెస్తాడు విజయుడు. సుమతి అతడు తన భర్తేనని గ్రహించి, ఈ నిజం విజయునికి తెలియచేయటం, వారందరినీ బంధించి హింసించబోయిన విక్రమసింహుని రేచుక్క, విజయుడు ఎదుర్కొని విజయం సాధించటం, యువరాణి, విజయుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది[1], [2]

మూలాలుసవరించు

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (22 December 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 రేచుక్క- పగటిచుక్క". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 30 December 2018.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18". telugu.greatandhra.com. Retrieved 10 August 2017.

బయటి లింకులుసవరించు