రేణుక అయోల తెలుగు కవయిత్రి.[1]

రేణుక అయ్యల సోమయాజుల
జననంకటక్ (ఒరిస్సా)
ఇతర పేర్లురేణుక అయోల
వృత్తికవయిత్రి, అనువాదకురాలు
భార్య / భర్తఅయ్యల సోమయాజుల అరుణ్ కుమార్

సాహితీ జీవితం మార్చు

రేణుక అయోల ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో జన్మించారు. ఈమె అసలు పేరు రేణుక అయ్యల సోమయాజుల. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల హిందీ గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం చేశారు. ఈ క్రమంలో చాలా గజల్స్‌ను ఆమె తెలుగులోకి అనువదించారు. జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, మెహదీహసన్, హరిహరన్ ఈమె అభిమానించే గజల్ కళాకారులు. గజల్స్ పై ఉన్న మక్కువే ఆమెను కవిత్వం రాయడానికి పురిగొల్పింది. ఆమె రాసిన లోపలి స్వరం కవితా సంపుటిలో సగానికి పైగా కవితలు ఆమె దైనందిన జీవితంలో తారసపడ్డ సంఘటనలు, ఆమె జీవితంలో ముడిపడ్డ సన్నిహితుల గురించి, స్థలాల గురించి చెప్పినవే. అలాగే రేణుక రాసిన ఎర్రమట్టి గాజులు కవితా సంపుటి గురించి విమర్శకులు సి.హెచ్‌.ఉషారాణి మాట్లాడుతూ "స్త్రీ సమాజంతో పోరాటం చేస్తూనే వుంటుంది. ఆ పోరాటం శారీరకంగా కంటే మానసికంగానే ఎక్కువ సాగుతుంది. మానసిక దాడులు మనిషికి, మనసుకు కొన్ని యోజనాల దూరం చేస్తుంది. ఒక మధ్య తరగతి ఆడపిల్ల అనేక కలల్ని, ఆశయాలను కలగలిపి మొసుకుంటూపోతూ దూరాన్ని కవిత్వంతో కొలుచుకుంటూ పోతున్న వైనం ఈ ఎర్రమట్టి గాజులు అని విశ్లేషించారు. [2]

కవిత్వంపై విశ్లేషణలు మార్చు

రేణుక అయోల కవిత్వాన్ని విశ్లేషిస్తూ సాహితీ వేత్త శైలజామిత్ర పలు వ్యాఖ్యలు చేశారు. "కలమనేది కాలంతో పాటు కదులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు మనల్ని హత్తుకుని నిరంతరం జ్ఞాపకానికి వస్తుంటాయి. అటువంటివే రేణుక కలం నుండి జాలువారిన నీటి బొమ్మ, మరణమే చరిత్ర, కొత్త ఉదయం పుట్టుక, ఊరి ప్రయాణం, పల్లకీలో పెళ్ళికూతురు కవితలు. ప్రతి కవితలో ఓ ఆర్ద్రత ఉంది. మానవత్వం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశీలన ఉంది. కవికి పరిశీలనా ఎంత అవసరమో అంతా రేణుక గారిలో ఉంది అనడం అతిశయోక్తి కాదు" అని తెలిపారు. [3] రచయిత సౌభాగ్య రేణుక కవిత్వాన్ని విశ్లేషిస్తూ అంతః తీరాల అన్వేషణ అనే గ్రంథంలో రాశారు. "రేణుక కవితలు జీవితాన్ని, అనంత విశ్వాన్ని ప్రశ్నిస్తాయి. [4] అలతి అలతి పదాలలో అమృతగుళికల్లాంటి భావాలతో కవితలను గుబాళింపచేస్తారు. అబద్ధంలాంటి కల నిజంలాంటి చేదుకన్నా వెయ్యిరెట్లు నయం అని చెప్పడంలో కలలపై ఆమె స్పష్టత అర్థమవుతుంది. జీవితాన్ని, అనంత విశ్వాన్ని ప్రశ్నించే నైజం ఆమె స్వంతం. కవితలలో ప్రతి పదం తాత్విక ధోరణిని ప్రదర్శిస్తుంటారు" అని తన రచనలో అభిప్రాయపడ్డారు సౌభాగ్య. [5]

రచనలు మార్చు

  • రెండు చందమామలు (కథల సంపుటి)[1]
  • పడవలో చిన్ని దీపం (కవితా సంపుటి)
  • లోపలి స్వరం (కవితా సంపుటి)
  • మూడవ మనిషి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
  • ఎర్ర మట్టి గాజులు
  • సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ)
  • పృధ... ఒక అన్వేషణ (దీర్ఝకావ్యం)

పురస్కారాలు మార్చు

  • [[రంజని కుందుర్తి (మంచి కవిత)
  • ఆంధ్రసారస్వత సమితి పురస్కారం ( వచన కవిత్వం)
  • రమ్యభారతి కథా పురస్కారం
  • ఇస్మాయిల్ అవార్డు ( వచన కవిత్వం 2012.
  • లేఖిని (మాతృ devo భవ)పురస్కారం
   ( వచన కవిత్వం 
  • అమృతలత అపురూపపురస్కారం( వచన కవిత్వం )

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2022-05-30.
  2. "మాలిక వెబ్ పత్రికలోని వ్యాసం".
  3. "సిలికానాంధ్ర వెబ్ పత్రికలోని వ్యాసం".
  4. "మధురవాణి పత్రికలోని వ్యాసం".
  5. "నవతెలంగాణ పత్రికలోని వ్యాసం". Archived from the original on 2021-05-08. Retrieved 2021-05-08.

యితర లింకులు మార్చు