రేష్మ ఔర్ షెరా

సునీల్ దత్ దర్శకత్వంలో 1971లో విడుదలైన హిందీ క్రైమ్ సినిమా.

రేష్మ ఔర్ షెరా, 1971 జూలై 23న విడుదలైన హిందీ క్రైమ్ సినిమా. సునీల్ దత్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వహీదా రెహమాన్ రేష్మ పాత్రలో, సునీల్ దత్ షెరా పాత్రలో నటించారు. వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రాఖీ, రంజీత్, కెఎన్ సింగ్, జయంత్, అమ్రీష్ పురి ఇతర సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వచ్చిన సమయంలో 12 సంవత్సరాల వయస్సు ఉన్న సునీల్ దత్ కుమారుడు సంజయ్ దత్ తొలిసారిగా ఇందులో ఖవ్వాలి గాయకుడిగా నటించాడు.[1]

రేష్మ ఔర్ షెరా
Reshma Aur Shera Movie Poster.jpg
రేష్మ ఔర్ షెరా సినిమా పోస్టర్
దర్శకత్వంసునీల్ దత్
రచనఎస్. అలీ రెజా
నిర్మాతసునీల్ దత్
నటవర్గంవహీదా రెహమాన్
సునీల్ దత్
వినోద్ ఖన్నా
అమితాబ్ బచ్చన్
అమ్రీష్ పురి
ఛాయాగ్రహణంరామచంద్ర
కూర్పుప్రాన్ మెహ్రా
సంగీతంజైదేవ్
నిర్మాణ
సంస్థ
అజంతా ఆర్ట్స్
విడుదల తేదీలు
1971, జూలై 23
నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

ఈ సినిమాకు దేశీయ, అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. 22వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గోల్డెన్ బేర్ అవార్డు కోసం నామినేట్ చేయబడింది.[2] 44వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతీయ ఎంట్రీగా ఎంపికైంది, కానీ నామినీగా ఆమోదించబడలేదు.[3]

ఈ సినిమా 19వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 3 విభాగాల్లో (వహీదా రెహమాన్ - ఉత్తమ నటిగా, జైదేవ్ - ఉత్తమ సంగీత దర్శకత్వం, రామచంద్ర - ఉత్తమ సినిమాటోగ్రఫీ) జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది.

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాలో "ఏక్ మీతి సి చుభన్, ఏక్ థండి సి అగ్గన్" (ఉధవ్ కుమార్ సాహిత్యం), "తు చందా మెయిన్ చాందిని" (బాల్కవి బైరాగి సాహిత్యం) వంటి క్లాసిక్ పాటలు ప్రాచూర్యం పొందాయి.[4][5]

అవార్డులుసవరించు

19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలుసవరించు

  1. "Reshma Aur Shera (1971)". Indiancine.ma. Retrieved 2021-08-02.
  2. Awards imdb.com.
  3. Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
  4. "Ek meethi si chuban".
  5. "Tu chanda main Chandini".

బయటి లింకులుసవరించు