రైతునేస్తం వ్యవసాయం సంబంధించిన విజ్ఞానాన్ని అందించే మాసపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు వెంకటేశ్వరరావు.[1] హైదరాబాద్ నుండి వెలువడుతున్నది.

విశేషాలు

మార్చు

రైతులను ప్రోత్సహించేందుకు రైతునేస్తం మాసపత్రిక నిరంతరం కృషి చేస్తోంది. రైతునేస్తం, పశునేస్తం పేరుతో రెండు మాసపత్రికలను ఈ సంస్థ ప్రచురిస్తున్నది.సేంద్రీయ వ్యవసాయ దారులకోసం ప్రకృతినేస్తం పేరుతో మరో వినూత్నమైన మ్యాగజైన్‌ను వెంకటేశ్వరరావుగారు నడుపుతున్నారు.[2]

రైతు నేస్తం సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్ర వేత్త, దివంగత పద్మశ్రీ డాక్టర్‌ ఐవి సుబ్బారావు పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా అగ్రి-జర్నలిస్టులతో పాటు విస్తరణాధికారులను అవార్డులతో ఘనంగా సత్కరిస్తారు. ఈ అవార్డును ప్రవేశపెట్టినది రైతు నేస్తం, పశునేస్తం, ప్రకృతి నేస్తం సంస్థల అధినేత వై.వెంకటేశ్వరరావు.[3] మన రైతులకు నాబార్డు, ఐసిఆర్‌ఎ లాంటి సంస్థలివ్వాల్సిన అవార్డులను ‘ రైతునేస్తం’ వెంకటేశ్వరరావు ఇవ్వడం అభినందనీయం.[4]

మూలాలు

మార్చు
  1. యూట్యూబ్ లో Rythu Nestham editor Venkateswara Rao - T News Agriculture Special Matti Manishi
  2. ‘సాగు’బాటు లేదు.. ‘గిట్టు’బాటు రాదు[permanent dead link]
  3. "రైతునేస్తం పురస్కారాలకు 31లోపు దరఖాస్తుల ఆహ్వానం (08-Aug-2015)". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-11.
  4. స్మార్ట్‌ విలేజీలు కావాలి....[permanent dead link]

ఇతర లింకులు

మార్చు