రైస్ పుల్లర్
పరిచయం
మార్చురైస్ పుల్లర్ (Rice Puller) అనగా బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహం. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం (Iridium) అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్స్ 415, 420 ప్రకారం రైస్ పుల్లర్లను ఎవరికైనా అమ్మడం చట్టరిత్యా నేరం.
రైస్ పుల్లర్లు ఏవేవి
మార్చురాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు వంటి వస్తువులు. నగలు, పూర్వపు నాణాలు మొదలైనవి. ఇవే కాకుండా నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద వంటి మొక్కల్లో కూడా రైస్ పుల్లర్ లక్షణాలున్నాయని చెబుతారు.
నమ్మకాలు
మార్చురైస్ పుల్లర్స్ ను బస్సులో తీసుకువెళ్తున్నప్పుడు బస్సు ఆగిపోతుందని, కొవ్వొత్తి మంట రైస్ పుల్లర్ వైపు వంగుతుందని కొంతమంది చెబుతారు.
రైస్ పుల్లర్స్ ను పరీక్షించే విధానాలు
మార్చుముందుగా రైస్ పుల్లర్ వస్తువును శుభ్రంగా డిటర్జెంట్ కనిపిన నీటితో కడగాలి. తరువాత ఉప్పునీటితో, ఆతర్వాత మామూలు నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
- స్టాప్లర్ పిన్ పరిక్ష: చిన్న ఇనుప స్టాప్లర్ ను రైస్ పుల్లర్ వద్ద పెడితే అది దానికి అంటుకుంటే ఆ రైస్ పుల్లర్ నిజమైనది కాదు
- వెంటనే పుల్ చేసే పరిక్ష: అప్పుడే తోలు తీసిన బియ్యాన్ని రెస్ పుల్లర్ వద్ద పెడితే ఆ బియ్యం దగ్గరకు లాగబడి రంగు మార్చబడుతుంది. ఇది ఎంత తక్కువ సమయంలో జరిగితే ఆ రైస్ పుల్లర్ అంత విలువైనది.
- ఇదే బియ్యాన్ని బలపరుపు నేలపై టెస్ట్ చేయని బియ్యం వద్ద పెడితే ఆ టెస్ట్ చేయని బియ్యాన్ని లాక్కుంటాయి.
- నాన్-మెటాలిక్ గ్లాసులో నీరు నింపి అందులో 4 బియ్యపు గింజల్ని నాలుగు వైపులా వేయాలి. కొంత సమయం తర్వాత అవి అడుగుభాగంలో మధ్యకు చేరతాయి. అవి పసుపు లేదా గోదుమ రంగులోకి మారాలి. గ్లాసులోకి పిన్నును వేస్తే అవి మళ్ళీ విడిపోవాలి. పిన్ను తీసేస్తే అ బియ్యం గింజలు మళ్ళీ మధ్యకు చేరతాయి. బియ్యం నీలం రంగులోకి మారితే రైస్ పుల్లర్ నిజంకాదు.
- నాన్-మెటాలిక్ గ్లాసులో నీరు నింపి అందులో 4 బియ్యపు గింజల్ని నాలుగు వైపులా వేయాలి. కొంత సమయం తర్వాత అవి అడుగుభాగంలో చేరతాయి. తరువాత బియ్యపు తొక్క పొట్టు వేస్తే ఆ బియ్యపు గింజలు నిట్టనిలువుగా పైకి తేలతాయి.
- 18 గేజ్ వున్న రాగి తీగను రైస్ పుల్లర్ పై 2, 3 చుట్లు చుట్టి ఒక చివరి భాగాన్ని కొద్దిగా వదలాలి. ఇప్పుడు 2 వ పరిక్ష చేయాలి.
- టార్చి లైటు పరిక్ష: రెండు పెన్సిల్ సెల్స్ తో పని చేసే టార్చి లైటుని తీసుకోవాలి. ముందు ఉన్న గ్లాసును తీసివేసి లైటు ఆన్ చేసి దాన్ని రైస్ పుల్లర్ అనుకుంటున్న వస్తువు నుండి ఒక అర అంగుళం దూరంలో ఉంచి పట్టుకోవాలి. మరో టార్చి లైటుని వస్తువు నుండి 5 లేక 6 అడుగుల దూరంలో ఉంచి పట్టుకోవాలి. ఒక ఐరన్ పిన్ ను తీసుకొని వస్తువు వద్ద పెట్టాలి. ఒక వేళ ఆ పిన్ను ఆ వస్తువు రైస్ పుల్లర్ కాదు. ఎంత తక్కువ సమయంలో టార్చి లైటు డిమ్ అయితే రైస్ పుల్లర్ అంత విలువైనది. టార్చి లైటు ఆఫ్ చేసి మరలా ఆన్ చేసినా డిమ్ గా ఉన్నట్లయితే టార్చి లైట్ పరిక్ష విజయవంతమైనట్లు.
మార్కెట్ విధానం
మార్చుడబ్బు సంపాదించుకోవాలనే ఆశతో ఒక వ్యక్తి తన పురాతన రాగి వస్తువులతో మధ్యవర్తికి విలువైన వస్తువులుగా పరిచయం చేసి వాటి కొనుగోలుదారులకు అమ్మమంటాడు. ఆ వస్తువులను పరీక్ష చేయాలనే నెపంతో అమ్మేవాడి నుండి పెద్ద మొత్తంలో బజానా తీసుకుంటాడు మధ్యవర్తి. కొన్నిరోజుల తర్వాత ఆ వస్తువుల నాంయత బాగోలేదనో, లేదా ఆ వస్తువులు అసలు రైస్ పుల్లర్స్ కావనో మధ్యవర్తి తెలివిగా తప్పించుకుంటాడు.
మోసాలు
మార్చు- 2010, డిసెంబరు 26 న హైదరాబాద్ నగరంలో ఒక కాపర్ ఇరీడియం బౌల్, 8 సెల్ ఫోన్ లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
- 2011 ఏప్రిల్ 9 న టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో బాబా అనే వ్యక్తి రైస్ పుల్లర్ ని 2 కోట్లకు అమ్మి పరారైనట్లు ప్రచురితమైనది.
- ఇటీవల కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కార్యకలపాలు సాగిస్తున్న ఏడుగురు రైస్ పుల్లర్ గ్యాంగ్ తిరువనంతపురంలో అరెస్టయ్యారు.
- 2012, ఆగష్టు 22 న డెహ్రాడూన్ లో నకిలీ నాణెం అమ్ముతున్న పన్నెండుమంది వ్యక్తులను అరెస్టు చేశారు.
- 2019 ఆగష్టు 30న అమలాపురం లో రైస్ పుల్లింగ్ అని చెప్పి డాక్టర్ రామకృష్ణ రాజుని నమ్మించి నలుగురు వ్యక్తులు 5కోట్లు తీసుకొని మోసం చేశారు డాక్టర్, అయన భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నారు
లంకెలు
మార్చు- http://en.wikipedia.org/wiki/Iridium
- http://www.google.co.in/search?q=rice+puller&hl=en&biw=1024&bih=571&prmd=imvns&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=G2iPUKvtBsTqrQfUy4C4BQ&ved=0CCQQsAQ
- http://www.goacom.com/goa-news-highlights/3929-police-suspect-inter-state-gang-in-rice-puller-scam[permanent dead link]
- https://web.archive.org/web/20120916013338/http://ricepullers.com/
- https://web.archive.org/web/20121225081623/http://www.monaestry.com/coin/pack.php
- https://web.archive.org/web/20121026133343/http://metalcorporation.org/page5.htm
- http://rice-puller.com/index.php?id=50898
- http://in.answers.yahoo.com/question/index?qid=20101102093040AAmi2au[permanent dead link]
- https://archive.today/20130628101309/www.allvoices.com/contributed-news/7719678-ricepuller-gang-arrested-in-gr eater-hyderabad-capital-city
- https://web.archive.org/web/20160306234739/http://whatventure.blogspot.in/2009/07/rice-puller-trader.html
- https://web.archive.org/web/20120629055402/http://rareearth.hpage.co.in/
- https://web.archive.org/web/20120908134259/http://fissilesales.com/